Shalini Ajith Hospitalized: హాస్పిటల్లో చేరిన శాలిని అజిత్ కుమార్.. అసలు ఏమైందంటే..
Shalini - Ajith Kumar: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో.. అజిత్ అజర్బైజాన్ లో తన సినిమా.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. కానీ తన భార్య శాలిని.. ఒంట్లో బాగాలేదని తెలియగానే షూటింగ్ ఆపేసి.. అజిత్ వెంటనే చెన్నైకి తిరిగి వచ్చేసారు. కొద్దిరోజుల పాటు తన భార్యకి తోడుగా ఉండాలని.. అజిత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Shalini Ajith Hospitalised: కోలీవుడ్ స్టార్ హీరో.. అజిత్ భార్య శాలిని అజిత్ కుమార్.. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఈ మైనర్ సర్జరీ చేయించుకున్న.. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ..ఫోటోలు షేర్ చేస్తూ ఉండే షాలిని తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హాస్పిటల్ డ్రెస్ లో ఉన్న శాలిని.. తన భర్త అజిత్ కుమార్ చెయ్యి పట్టుకుని నవ్వుతూ ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఆ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో..షేర్ చేస్తూ "ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను" అంటూ పోస్ట్ చేశారు. దీంతో అసలు ఉన్నట్టుండి శాలిని ఆరోగ్యానికి ఏమైంది.. ఆమె హాస్పిటల్ లో ఎందుకు ఉంది అంటూ అభిమానులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అందరూ ఆమె ఆరోగ్యం ఎలా ఉంది.. అంటూ కామెంట్లో పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఇది ఒక పర్సనల్ ప్రాబ్లం అని అందుకే వివరాలు చెప్పడం.. లేదని తెలుస్తోంది. అయితే శాలినికి మైనర్ సర్జరీ జరిగిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం ఆమె బాగానే కోలుకుంటుంది.. అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
త్వరలోనే దీనికి సంబంధించిన.. అధికారిక ప్రకటన కూడా బయటకు వస్తుందని తెలుస్తోంది. అయితే శాలిని ఆరోగ్యం పాడైనప్పుడు అజిత్ అజర్ బైజాన్ లో విదామూయర్చి అనే సినిమా షూటింగ్లో.. బిజీగా ఉన్నారు. కానీ తన భార్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే షూటింగ్ నుంచి కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తిరిగి చెన్నైకి వచ్చేసారు.
ఇప్పుడు ఎయిర్ పోర్టులో అభిమానుల.. కోసం ఆగి ఫోటోలు కూడా దిగే అజిత్ ఈసారి మాత్రం ఎవరికోసం ఆగకుండా వేగంగా హాస్పిటల్ కి చేరుకున్నారు.
విదామూయర్చి.. సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇందులో త్రిష అజిత్ భార్య పాత్రలో కనిపించనుంది. త్రిష కనిపించకుండా పోతుందని ఆమెను వెతుక్కుంటూ హీరో అజిత్ తిరుగుతూ.. ఉంటారని, ఆమెను వెతికే ప్రయాణంలో ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేదే సినిమా కథ అని తెలుస్తోంది.
మరోవైపు శాలిని ఆరోగ్య పరిస్థితి ఇంకా బాగోకపోవడంతో అజిత్ కొద్దిరోజులు.. ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ఉన్నారు. తన భార్య శాలినితోనే సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు అజిత్. మరి తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపడతారో చూడాలి. శాలిని ఆరోగ్యం.. కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?
Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి