శర్వానంద్‌, సమంత అక్కినేని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జాను’. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తోన్న జాను తొలి పాట వచ్చేసింది. ఇప్పటికే రిలీజైన జాను ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచునాలను పెంచేసేంది. తాజాగా మంగళవారం (జనవరి 21న) తొలి పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


‘ప్రాణం నా ప్రాణం నీతో ఇలా.. తొలి గానం పాడే వేళ’ అంటూ సాగిపోయే తొలిపాట ప్రేమికులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్  చిన్నయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్ అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత స్వరాలు సమకూర్చారు. ఈ మెలోడిని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మ్యూజిక్ యూనిట్ ధీమాగా ఉంది.


See PHOTOS: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు


తమిళంలో సక్సెస్ అయిన '96' మూవీకి రీమేక్ జాను. విజయ్ సేతుపతి, త్రిష పాత్రలను శర్వానంద్, సమంత పోషిస్తున్నారు. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..