Aadavallu Meeku Joharlu New Song: శర్వానంద్‌, రష్మిక మందన జోడిగా తెరకెక్కిన మూవీ "ఆడవాళ్లు మీకు జోహార్లు". తిరుమల కిషోర్‌ డెరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీలో సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశీ నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్‌ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్‌‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 19వ తేదీన రిలీజ్‌ అవుతుంది. ఈ రోజు సాయంత్రం ఆరుగంట మూడు నిమిషాలకు ఈ మూవీ నుంచి థర్డ్‌ లిరికల్ సాంగ్ రానుంది.


ఈ మేరకు మూవీ యూనిట్‌ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంతేకాదు ఒక కొత్త పోస్టర్‌‌ను కూడా వదిలింది. మూవీలో శర్వానంద ఫ్యామిలీతో ఆప్యాయంగా ఉండే తీరు ఈ పోస్టర్‌‌లో ఆవిష్కరించారు.



 


ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు సాంగ్స్‌ అదిరిపోయాయి. శర్వానంద్, రష్మికల జోడీ ఆకట్టుకుంది.  ఈ రోజు రానున్న మూడో సాంగ్.. రేపు రానున్న ట్రైలర్‌‌ కూడా అదిరిపోనున్నాయంటూ శర్వా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, ప్రదీప్‌ రావత్‌, రవిశంకర్‌, సత్య తదితరులు నటించారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Also Read: Ketika Sharma Photos: అందాలు ఆరబోసిన కేతిక శర్మ.. గ్లామర్ డోస్ మాములుగా లేదుగా!!


Also Read: Deepika Padukone Photos: షర్ట్ లో మెస్మరైజ్ చేస్తున్న సొట్టబుగ్గల సుందరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook