Sharwanand: శర్వానంద్ హీరోగా మహా సముద్రం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమా సెట్స్‌పై హీరో శర్వానంద్ సందడి చేస్తున్నాడు. అదితిరావు హైదరీ కధానాయకిగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం జిల్లా సింహగిరిపై హీరో శర్వానంద్ (Sharwanand) సినిమా మహా సముద్రం షూటింగ్ సందడి నెలకొంది. సింహాచలం ఆలయ ప్రాంగణంలో ధ్వజస్థంభం, కళ్యాణ మండపంలో కొన్ని సన్నివేశాల్ని హీరో శర్వానంద్, హీరోయిన్ అదితిరావు హైదరి(Aditirao Hydari)లపై దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. కుటుంబంతో సహా ఓ చిన్నపాపకు అక్షరాభ్యాసం చేసేందుకు హీరో ఆలయానికి చేరుకునే సన్నివేశాల్ని, కళ్యాణమండపంలో స్వామీజీ ప్రవచన సన్నివేశాన్ని చిత్రీకరించారు. విశాఖపట్నంలో మహా సముద్రం సినిమా షూటింగ్ 34 రోజులపాటు నిర్వహించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర్ నిర్మాతగా వ్యవహరిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. చైతన్య భరద్వాజ సంగీతం సమకూర్చారు. 


షూటింగ్ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టితో హీరో శర్వానంద్ మాట్లాడారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా సముద్రం సినిమా(Mahasamudram movie shooting) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Also read: Pawan Kalyan: వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య తోపులాట, పగిలిన అద్దాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook