Sharwanand's Oke Oka Jeevitham Official Teaser released by Suriya: టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ఇటీవలి కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'మహా సముద్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా.. మరో రెండు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. శర్వానంద్ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham), ఆడాళ్లు మీకు జోహర్లు సినిమాలు ఉన్నాయి. శ్రీ కార్తీక్‌ (Shree Karthick) తెరకెక్కిస్తున్న ఒకే ఒక జీవితం సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయిక కాగా.. అమల అక్కినేని (Amala Akkineni), వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే ఒక జీవితం సినిమా టీజర్‌ను తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఈరోజు విడుదల చేశారు. 'ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు' అనే డైలాగ్‌తో టీజర్‌ ఆరంభం అయింది. శర్వానంద్ గిటారిస్ట్‌గా కనిపించాడు. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శిలు శర్వా స్నేహితులుగా అలరించారు. ఈ ముగ్గురు భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావడం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తల్లీ కొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. టైమ్‌ మెషీన్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. సీనియర్ నటుడు నాజర్ స్టోరిని కీలక మలుపు తిప్పాడు. 


Also Read: Sri Reddy Comments on Samantha: 'ఆమె బట్టలు విప్పినా అక్కడ ఏమి ఉండవు'.. సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు


 



ఒకే ఒక జీవితం సినిమా టీజర్‌ (Oke Oka Jeevitham Official Teaser)లో శర్వానంద్‌ (Sharwanand) కూల్‌ లుక్స్‌ అందరిని ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) ఒక సీన్‌లో మాత్రమే కనిపించారు. టైమ్‌ మెషీన్‌ (Science Fiction) కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహా సముద్రం నిరాశపరిచినా.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని శర్వా చూస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఒకే ఒక జీవితం సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయా గ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Also Read: Shardul Thakur: థర్డ్ అంపైర్.. నిద్ర పోతున్నావా ఏంది! శార్దూల్ ఠాకూర్ వికెట్‌పై సోషల్ మీడియాలో దుమారం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి