Sherlyn Chopra's legal notice to Shilpa Shetty, Raj Kundra: షెర్లిన్ చోప్రా తమపై నిరాధారమైన ఆరోపణలు చేసి, తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని పేర్కొంటూ ఆమె రూ. 50 కోట్లు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు జవాబు ఇవ్వాల్సిందిగా లీగల్ నోటీసులు అందుకున్న షెర్లిన్ చోప్రా తాజాగా వారికి తనదైన స్టైల్లో అంతే ఘాటు రిప్లై ఇచ్చింది. తాను చేస్తున్న న్యాయపోరాటాన్ని అడ్డుకునేందుకు డిఫేమేషన్ సూట్‌ను (defamation suit) ఓ అస్త్రంగా వాడుకున్న రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులు.. అండర్ వరల్డ్ మాఫియాతో తనపై బెదిరింపులకు పాల్పడ్డారని, మానసికంగా చిత్రవధకు గురయ్యేలా చేశారని షెర్లిన్ చోప్రా ఆరోపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mental harassment - మానసికంగా చిత్రవధ:
అండర్ వరల్డ్ మాఫియా సహాయంతో తనపై బెదిరింపులకు పాల్పడి, తనను మానసికంగా వేధించినందుకు రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులే తనకు రూ. 75 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులకు షెర్లిన్ చోప్రా లీగల్ నోటీసులు (Sherlyn Chopra demands Rs 75 crore) పంపించింది. 


నేను భయపడే ప్రసక్తే లేదు:
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి బెదిరింపులకు తాను భయపడే రకం కాదని స్పష్టంచేసిన షెర్లిన్ చోప్రా.. ఈ కేసులో పోలీసులు ముందుగా తన వాంగ్మూలం నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేసింది. ఆ తర్వాత అసలు వివరాలు వాటంతట అవే బయటకు వస్తాయని షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) ధీమా వ్యక్తంచేసింది. 


What, when and why - ఎప్పుడు, ఎందుకు, ఏం జరిగిందంటే... 
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై షెర్లిన్ చోప్రా అక్టోబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్టోబర్ 19న రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఆమెపై పరువు నష్టం కేసు పెట్టారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 50 కోట్లు చెల్లించాల్సిందిగా వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా వార్తా పత్రికలు, డిజిటల్ మీడియా మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే చట్టరీత్యా తదుపరి పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా శిల్పా శెట్టి దంపతులు (Shilpa Shetty, Raj Kundra to Sherlyn Chopra) తమ డిఫేమేషన్ పిటిషన్ ద్వారా షెర్లిన్ చోప్రాను హెచ్చరించారు.