Bigg Boss OTT 3 Armaan Kritika Malik: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టెలివిజన్‌ షో బిగ్‌బాస్‌. దాదాపు దేశంలోని అన్ని భాషల్లో ఈ షో నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ షోపై ఎంతటి ఆసక్తికర విషయాలు ఉన్నాయో అంతటి వివాదం కూడా నడుస్తోంది. బిగ్‌బాస్‌ షోలో దృశ్యాలు.. కంటెస్టెంట్ల ప్రవర్తన దిగజారి ఉంటుండడంతో ఈ షోను నిషేధించాలనే డిమాండ్లు తరచూ వస్తున్నాయి. తాజాగా మరో దుమారం రేపే సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కంటెస్టెంట్‌లు బెడ్‌రూమ్‌లో 'ఆ పని' కానిచ్చేశారు. అవి అలాగే ప్రసారం కావడంతో మహారాష్ట్రలో రచ్చరచ్చ అవుతోంది. ఆ షోను నిషేధించాలని ఓ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Needle In Body: కడుపులో సూది మరచిన వైద్యులు.. రోగికి రూ.5 లక్షలు బహుమానం


బిగ్‌బాస్‌ షో మహారాష్ట్రలో ప్రారంభమైంది. బిగ్‌బాస్‌ ఓటీటీ-3 షో కొనసాగుతుండగా తీవ్ర వివాదం ఏర్పడింది. వెండి తెర, బుల్లితెర నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఆ షోలో కంటెస్టెంట్లు ఉన్నారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ షోలో భాగమయ్యారు. అయితే ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో దారుణ దృశ్యాలు కనిపించాయి. జూలై 18వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో హౌస్‌లో కంటెస్టెంట్లుగా ఉన్న అర్మాన్‌ మాలిక్‌, కృతికా మాలిక్‌ జంట రెచ్చిపోయారు. వారిద్దరూ శ్రుతిమించి ప్రవర్తించారు. హద్దులు దాటేసి శ్రుతి మించి బెడ్‌రూమ్‌లో చేసే పని కానిచ్చారు.

Also Read: Allu Arjun Sukumar: పుష్ప 2పై బిగ్ అప్డేట్.. బన్నీ, సుక్కు విభేదాలపై నిర్మాత బన్నీ వాసు ప్రకటన


అశ్లీల దృశ్యాలు
ఆ ఎపిసోడ్‌లో ఆ సీన్లు కూడా ప్రసారం కావడంతో తీవ్ర దుమారం రేగింది. బిగ్‌బాస్‌ షోపై శివసేన (శిందే వర్గం) అధికార ప్రతినిధి మనీషా కయాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సీన్లు ప్రసారం కావడాన్ని తప్పుబట్టారు. వెంటనే ముంబై పోలీస్‌ కమిషనర్‌ను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌ షోను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అర్మాన్‌, కృతికా మాలిక్‌ శ్రుతిమించారని.. ఇంటిల్లిపాది చూసే ఆ షోలో అలాంటి ప్రసారాలు ఎలా వేస్తారని ప్రశ్నించారు.


షో రద్దుకు డిమాండ్
'బిగ్‌బాస్‌ షోను చిన్నపిల్లలు కూడా చూస్తారు. అలాంటి షోలో అభ్యంతరకర సీన్లు ఎలా వేస్తారు. ఆ సీన్లు పిల్లలపై ప్రభావం చూపవా' అని మనీషా కయాండే నిలదీశారు. వెంటనే బిగ్‌బాస్‌ షోను నిలిపివేయాలని ముంబై పోలీస్‌ కమిషనర్‌ను కోరారు. అంతేకాకుండా సైబర్‌ క్రైమ్‌ చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బిగ్‌బాస్‌ తప్పుదోవలా నడుస్తోందని.. ఇది ఏమాత్ర కుటుంబం కలిసి చూసే రియాల్టీ షో కాదని స్పష్టం చేశారు. ఈ షోపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు.








స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter