Allu Arjun Sukumar: పుష్ప 2పై బిగ్ అప్డేట్.. బన్నీ, సుక్కు విభేదాలపై నిర్మాత బన్నీ వాసు ప్రకటన

Producer Bunny Vasu Clears On Rumours Sukumar Allu Arjun Issue: త్వరలో విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడిందని.. దర్శకుడు, హీరోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పుకార్లు షికారు చేయగా.. వాటికి నిర్మాత బన్నీ వాసు కీలక ప్రకటన ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 19, 2024, 08:37 PM IST
Allu Arjun Sukumar: పుష్ప 2పై బిగ్ అప్డేట్.. బన్నీ, సుక్కు విభేదాలపై నిర్మాత బన్నీ వాసు ప్రకటన

Pushpa 2 The Rule Update: కథనాయకుడు, దర్శకుడు మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సినిమా షూటింగ్‌ ఆగిందని.. సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుందని పుష్ప 2 గురించి ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లడంతో సామాజిక మాధ్యమాల్లో పుష్ప 2పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా ఆ సినిమా నిర్మాత స్పందించారు. సినిమా యూనిట్‌లో భేదాభిప్రాయాలు వచ్చాయని జరుగుతున్న ప్రచారాన్ని చూసి నవ్వుకున్నట్లు నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. అలాంటిదేమీ లేదని స్పష్టత నిచ్చారు. 

Also Read: Urvashi Rautela: హాట్ హీరోయిన్‌ వీడియో లీక్‌.. బాత్రూమ్‌లో బట్టలు విప్పుతూ..

ఈ మేరకు పుష్ప 2 సినిమాపై జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్‌ వార్తలపై శుక్రవారం బన్నీ వాసు కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ గడ్డం తీసేయడంపై కూడా స్పందించారు. ఆయ్‌ సినిమాకు సంబంధించిన పాట విడుదల కార్యక్రమంలో బన్నీ బాసు మాట్లాడారు. 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యిందని.. కేవలం 15 రోజుల షూటింగ్‌ మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపారు. దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ మధ్య అభిప్రాయాల భేదాలు వచ్చాయని చెప్పడం అవాస్తవం అని పేర్కొన్నారు.

Also Read: MAA Complaints: ట్రోల్స్‌కు తట్టుకోలేని 'మా' సంఘం.. యూట్యూబ్‌ చానల్స్‌, మీమ్‌ పేజీస్‌పై ఫిర్యాదు

అతడి వల్లే?
'పుష్ప 2 సినిమాలపై వచ్చిన పుకార్లు, వార్తలు చదివి నవ్వుకున్నా. ఉచితంగా మాకు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ పోషిస్తున్న పాత్రకు సంబంధించి కేవంల 15 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. క్లైమాక్స్‌తోపాటు ఓ పాటలో బన్నీ నటించాలి అంతే! విలన్‌ పాత్రధారి ఫహాద్‌ ఫాజిల్‌ పాత్రకు సంబంధించిన పని మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఏప్రిల్‌, మేలో ఫహాద్‌ డేట్స్‌ రద్దవడంతో వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది' అని బన్నీ వాసు తెలిపారు.

నిజం ఇదే!
'క్లైమాక్స్‌ తీయకముందే సుకుమార్‌ ఎడిటింగ్‌ చేయాలని నిర్ణయించారు. దీనికి దాదాపు 35 రోజుల సమయం పడుతుంది. ఈ విరామ సమయంలో కుటుంబంతో కలిసి అల్లు అర్జున్‌ టూర్‌కు వెళ్లారు. లెక్కలేసుకుని అల్లు అర్జున్‌ గడ్డం తీసేశారు. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు, అర్జున్‌కు సుకుమార్‌తో మంచి అనుబంధం ఉంది. దాని గురించి మాటల్లో చెప్పలేను. మరో ఆరు నెలలు షూటింగ్‌ చేయాలని సుకుమార్‌ చెబితే బన్నీ తప్పకుండా చేస్తారు. వారిద్దరి కెరీర్‌లో పుష్ప ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. దీనిపై పుకార్లు రావడం సరికాదు. మిగిలిన సినిమా ఆగస్టు తొలి వారంలో ఓ షెడ్యూల్‌లో ప్రారంభమవుతుంది' అని బన్నీ వాసు ప్రకటించారు.

పుకార్లకు ఫుల్ స్టాప్
పుష్ప 2 సినిమాపై వస్తున్న దుష్ప్రచారంపై నిర్మాత బన్నీ వాసు స్పష్టతనివ్వడంతో అల్లు అర్జున్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అతడి ప్రకటనతో సినిమా షెడ్యూల్‌ ప్రకారమే డిసెంబర్‌లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. కాగా పుష్ప సినిమాపై కొన్ని రోజులుగా విస్తృతంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అల్లు అర్జున్‌, సుకుమార్‌ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. సినిమా షూటింగ్‌ అర్థాంతరంగా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఈ సినిమా మరింత వాయిదా పడిందని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బన్నీ వాసు ప్రకటనతో ఆ తప్పుడు వార్తలకు అడ్డుకట్ట పడింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x