Madhumitha Oo Antava Song Video వెండితెరపై ఎన్నో ప్రేమ కథలు చూస్తూనే ఉంటాం. ప్రేమ కథల్లో నటించిన నటీనటుల్లో కొంత మంది రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారుతుంటారు. పెళ్లితో ఒక్కటవుతారు. ఆ తరువాత కొంత మంది విడాకుల దారిలో వెళ్తారు. కానీ కొంత మంది మాత్రం ఆ వివాహాబంధాన్ని కాపాడుకుంటూ వస్తారు. వారి సంసారాన్ని చక్కగా సరిదిద్దుకుంటూ వస్తుంటారు. అలాంటి వారిలో శివ బాలాజీ, మధుమిత ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివ బాలాజీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఆ మధ్య స్కూల్ ఫీజుల మీద పోరాటం చేశాడు. బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్‌ విన్నర్‌గా శివ బాలాజికి మంచి ఇమేజ్ వచ్చింది. అయితే సినిమా ఆఫర్లేమీ ఎక్కువగా రాలేదు. సినీ కెరీర్‌లో అంత మార్పులేమీ రాలేదు.


కానీ ఇప్పుడిప్పుడు శివ బాలాజీకి కొత్త కొత్త పాత్రలు వస్తున్నాయి. నెగెటివ్ రోల్స్ ఎక్కువగా పోషిస్తున్నాడు. ఓటీటీ, సిల్వర్ స్క్రీన్ ఇలా అన్ని చోట్ల శివ బాలాజీ దుమ్ములేపేస్తున్నాడు. విలన్‌గా శివ బాలాజీ అందరినీ మెప్పిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే శివ బాలాజీ తన భార్యతో కలిసి ఇలా సందడి చేసేస్తున్నాడు.


 



తాజాగా మధుమిత ఓ వీడియోను షేర్ చేసింది. అందులో శివ బాలాజీ, మధుమిత కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. పుష్ప సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్ ఊ అంటావా అనే పాటకు స్టెప్పులు వేశారు ఈ జంట. ఇక మధుమిత అయితే వేసుకున్న డ్రెస్, చేసిన స్టెప్పులు చూసి జనాలు అవాక్కవుతున్నారు.


మధుమిత ఏంటి ఇంత హాట్‌గా కనిపిస్తోంది.. ఇలా ఊపేస్తోంది? అదరగొట్టేస్తోందంటూ మధుమిత మీద కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆట సందీప్ కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. అద్భుతంగా డ్యాన్స్ వేశారు.. ఇన్‌స్పైరింగ్ జోడి అంటూ ప్రశంసలు కురిపించాడు.


Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్


Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook