టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని, కరోనా వైరస్ (CoronaVirus) నుంచి ఆయన కోలుకోలేకపోతున్నారని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తన తండ్రి, నటుడు డాక్టర్ రాజశేఖర్ (Actor Rajasekhar) ఆరోగ్యంపై ఆయన కూతురు శివాత్మిక స్పందించారు. తన తండ్రి రాజశేఖర్ కరోనా వైరస్ (CoronaVirus)తో స్ట్రాంగ్‌గా పోరాడుతున్నారని నటి శివాత్మిక తెలిపింది. మన అందరి ప్రేమ, ప్రార్థనతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘డియర్ ఆల్...
కోవిడ్‌తో నాన్న (రాజశేఖర్) పోరాటం కష్టతరంగానే ఉంది. అవును ఆయన ఇంకా స్ట్రాంగ్‌గా పోరాడుతున్నారు. మన అందరి ప్రేమ, ప్రార్థనలు తోడుంటేఆయన త్వరగా కోలుకుంటాడని నమ్ముతున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు ప్రార్థించండి. మీ ప్రేమ, ప్రార్థనతో ఆయన మరింత స్ట్రాంగ్ అవుతారు’ అని శివాత్మిక ట్వీట్ చేశారు. టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు శివాత్మిక ట్వీట్‌పై స్పందిస్తున్నారు. రాజశేఖర్ త్వరగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రీట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ ధైర్యం చెబుతున్నారు. రాజశేఖర్ త్వరగా కోలుకుని ఇంటికి వచ్చేస్తారని స్పందిస్తున్నారు.





 


కాగా, శివాత్మిక ట్వీట్ గమనిస్తే హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని తెలుస్తోంది. రాజశేఖర్‌తో భార్య, నటి జీవిత.. కుమార్తెలు శివాని, శివాత్మికలు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి శివాని, శివాత్మికలు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కానీ, రాజశేఖర్, జీవిత ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. వారు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe