RRR Movie NTR teaser: ‘వాడి పొగరు ఎగిరే జెండా’.. గర్జించిన కొమరం భీమ్‌

రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి (ss rajamouli) డైరెక్షన్‌లోని ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం ) సినిమాలోని జూ.ఎన్టీఆర్ (Jr Ntr) వెర్షన్ టీజర్ గురువారం విడుదలయింది. "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో విడుదలయిన ఈ టీజర్ వచ్చిరాగానే రికార్డుల మోత మోగిస్తోంది.

Last Updated : Oct 22, 2020, 03:35 PM IST
RRR Movie NTR teaser: ‘వాడి పొగరు ఎగిరే జెండా’.. గర్జించిన కొమరం భీమ్‌

Ram charan's voice for Jr Ntr in RRR movie teaser released: రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి (ss rajamouli) డైరెక్షన్‌లోని ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం ) సినిమాలోని జూ.ఎన్టీఆర్ (Jr Ntr) వెర్షన్ టీజర్ గురువారం విడుదలయింది. "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో విడుదలయిన ఈ టీజర్ వచ్చిరాగానే రికార్డుల మోత మోగిస్తోంది. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి.. అంటూ సాగే ఈ టిజర్‌లో ఎన్టీఆర్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ బ్యాక్ వాయిస్‌లో ‘వాడు నా తమ్ముడు కొమరం భీమ్’ అని.. రామ్ చరణ్ (Ramcharan) చెప్పే డైలాగులు అందరినీ ఆసక్తికరంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. రాజమౌళి డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది.. అని ఈ టిజర్‌లో అచ్చుగుద్దినట్లు చూపించారు. తాజాగా విడుదలయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ టీజర్ సినిమా అంచనాలను మరింత భారీగా పెంచాయి.

రామ్ చరణ్ "భీమ్ ఫర్ రామరాజు" అనే టీజర్ ( Bheem for Ramaraju teaser ) రామ్ చరణ్ బర్త్ డే ( Ramcharan birthday ) సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో రామ్ చరణ్ యాక్షన్స్‌కి ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చి ఆ టీజర్‌కి బలం చేకూర్చాడు. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న కొమురం భీమ్ టీజర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నా.. ఏవో కారణాలతో జక్కన్న విడుదల చేయలేదు. ఈ రోజు కొమురం భీం జయంతి సందర్భంగా ఎన్టీఆర్ టీజర్‌ని ( Jr Ntr teaser from RRR movie ) మూడు భాషల్లో విడుదల చేశారు. Also read : Ramaraju for Bheem teaser: 'రామరాజు ఫర్ భీమ్ ' సీక్రెట్ ఇదేనా ?

రౌద్రం ర‌ణం రుధిరం (RRR) సినిమాను రాజ‌మౌళి చ‌రిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్ నటిస్తున్నారు. వారి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.   Also read : Amma Rajasekhar: అమ్మరాజశేఖర్ ఎంతపని చేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News