Dil Raju to Release Thegimpu and Kalyanam Kamaneeyam in Nizam & Vizag along with Varasudu: ఈ ఏడాది సంక్రాంతికి గట్టి పోటీగా ఉండేటట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు నుంచి వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, వీరసింహారెడ్డి సినిమాతో నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు.


అయితే ఈసారి మైత్రి మూవీ మేకర్స్ కు దిల్ రాజుకు మధ్య కాస్త దూరం పెరిగిన నేపథ్యంలో దిల్ రాజు తాను నిర్మించిన వారసుడు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడమే కాక నైజాం ప్రాంతంలో అజిత్ హీరోగా నటించిన తెగింపు అదే విధంగా యూవీ వాళ్లు రిలీజ్ చేస్తున్న కళ్యాణం కమనీయం సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. కేవలం నైజాం ప్రాంతంలోనే కాదు ఉత్తరాంధ్రలో కూడా దిల్ రాజు ఈ సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పేపర్ ప్రకటనలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు మిగిలిన థియేటర్లలోనే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి దిల్ రాజు విడుదల చేస్తున్న మూడు సినిమాలలో రెండు సినిమాలు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కాగా ఒక సినిమా మాత్రమే స్ట్రైట్ సినిమా. ఇక దిల్ రాజు సొంత సినిమా కావడంతో ఎక్కువగా వారసుడు మీద ఆయన ఫోకస్ అయితే పెడతారు, అయితే మిగతా రెండు సినిమాలను కూడా విడుదల చేయటం ఎందుకు అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


దిల్ రాజు ఈ విషయంలో ఎందుకింత పట్టింపు తీసుకుని మరి మైత్రి మూవీ మేకర్స్ కి పోటీగా సినిమాలను చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తమ సినిమాల హక్కులు దిల్ రాజుకు ఇవ్వకుండా ఆయనకు పోటీగా ఆఫీసు ఓపెన్ చేయడంతోనే వారి మధ్య కాస్త గ్యాప్ పెరిగిందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో అలాంటిదేమీ లేదని పలు సందర్భాల్లో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ ప్రచారం అయితే ఇంకా జరుగుతూనే ఉంది. 


Also Read: Rashmika-Vijay: మరోసారి అడ్డంగా దొరికేసిన విజయ్ దేవరకొండ- రష్మిక.. చూసుకోకపోతే ఎలా అబ్బా?


Also Read: Stampede in Chandrababu Guntur Sabha: గుంటూరు బాబు సభలో తొక్కిసలాట..ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook