Thalapathy Vijay Last Movie: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ది గోట్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ తలపతి69 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదే ఫ్యాన్స్ కి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకునేలా చేస్తోంది. ఈ సినిమా తర్వాత విజయ్ నటనకు వీడ్కోలు పలకనున్నారు. అంటే అభిమానులు విజయ్ ను ఆఖరి సారిగా ఈ సినిమాతోనే వెండి తెర మీద చూడగలరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌పై బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా గురించిన కొన్ని రూమర్స్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన చేసిన రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో, తలపతి 69 కూడా ఇలాగే ఉంటుందా అని సందేహాలు ఒకపక్క ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. 


మరోవైపు ఈ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తారాగణాన్ని ప్రకటించింది. ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్, పూజా హెగ్డే వంటి ప్రముఖులు నటించనున్నారు. కానీ, ఈ క్యాస్టింగ్ అభిమానులలో ఆసక్తిని కలిగించాల్సింది పోయి, మరింత ఆందోళనకు గురి చేస్తోంది.


తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా భగవంత్ కేసరి అనే తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్ అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో.. విజయ్ బాలకృష్ణ పాత్రలో నటిస్తారని, మమితా బైజు శ్రీ లీల పాత్రను, బాబీ డియోల్ అర్జున్ రాంపాల్ పాత్రను పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.


ఈ రూమర్స్ మీద చిత్ర బృందం అధికారికంగా రియాక్ట్ కాలేదు కానీ విజయ్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. రీమేక్‌లు చాలా సార్లు ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ కి కంగారు మొదలైంది. మరి కనీసం చిత్ర బృందం దీని గురించి క్లారిటీ ఇస్తే.. ఫ్యాన్స్ కి కొంత ఊరట లభించే అవకాశం ఉంది.


Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని


Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి