Shruti Haasan Without Makeup Pic Trolls శ్రుతి హాసన్ ఎప్పుడూ కూడా తన బాడీ గురించి తన ఆరోగ్య పరిస్థితి గురించి తన సర్జరీల గురించి దాచి పెట్టింది లేదు. నిర్భయంగా శ్రుతి హాసన్ ఇలాంటి విషయాలన్ని స్పందిస్తూనే ఉంటుంది. సమాజంలో ఇప్పటికీ కొన్ని విషయాలు చర్చించేందుకు ఇష్టపడరు. ఆడవారి సమస్యలు, పీరియడ్స్ వంటి విషయాల మీద చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేయరు. కానీ శ్రుతి హాసన్ మాత్రం తనకు పీరియడ్స్ అని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో తాను ఎలా ఉందో చూపించేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాస్త జ్వరంగా ఉందని, సైనస్ కూడా వచ్చిందని, పీరియడ్స్ సమయం అని చెప్పి.. మేకప్ లేకుండా ఇంట్లో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అందులో శ్రుతి హాసన్ మొహంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో జనాలు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. సోషల్ మీడియాలో ఆమె మీద దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై శ్రుతి హాసన్ స్పందించింది.


[[{"fid":"254427","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సమాజంలో ఇలాంటి మాట్లాడటం సాధారణ విషయాలు అవ్వాలని నేను నా మెంటల్ హెల్త్, పీరియడ్స్ సమస్యలు, సైనస్ వల్ల మొహం అలా అయిపోయిందని పోస్ట్ చేశాను. మన శరీరం మీద, మన వ్యక్తిత్వం మీద మాట్లాడేందుకు ఎవ్వరికీ హక్కు లేదు.. ఏం చేయాలనుకుంటున్నావో.. ఎలా ఉండాలనుకుంటున్నావో.. అలానే ఉండు.. ఇది నీ జీవితం.. అదే మన జీవితంలో పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది.. ఇలా కామెంట్ల సెక్షన్లలో నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లు సాధారణ జీవితాలను గడిపేస్తుంది.. ఇక ఈ సమాజం ఎప్పటికీ మారదన్నట్టుగా శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేసింది.


శ్రుతి హాసన్ ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో వీర సింహారెడ్డి అనే సినిమాల్లో నటిస్తోంది. ఇది కాకుండా ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలోనూ నటిస్తోంది. శ్రుతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి ముంబైలో ఉంటోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు


Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook