Shruti Haasan Suffered With Viral Fever శ్రుతి హాసన్‌కు ఈ ఏడాది ఆరంభమే అదిరిపోయింది. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే.. ఆ రెండు కూడా హిట్ అయ్యాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ కాగా.. రెండో సినిమా హిట్‌గా నిలిచింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఈ రెండు సినిమాల్లో శ్రుతి హాసన్ నటించింది. వీర సింహారెడ్డి సినిమాలోని పాత్రతో శ్రుతి హాసన్ మీద ట్రోలింగ్ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఆ ట్రోలింగ్ అలా ఉంటే.. శ్రుతి హాసన్ మెగా ఫ్యాన్స్‌కు మండిపోయేలా కామెంట్లు చేస్తూ వచ్చింది. చిరంజీవి శ్రీదేవీ పాటలో తనకు సింపుల్‌గా చీరకట్టి మంచులో వదిలేశారని వాపోయింది. హీరోలకు ఏమో.. శాలువాలు కప్పుతారు. మరి తమకు మాత్రం చీరలో ఉండాలని కండీషన్ పెడతారు. అంత చలిలో ఎలా ఉండగలం అంటూ ఇలా నిలదీసింది శ్రుతి హాసన్. ఇదే విషయాన్ని షూటింగ్ టైంలో ఎందుకు చెప్పలేదు అంటూ మెగా ఫ్యాన్స్ నిలదీశారు.


[[{"fid":"270932","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇప్పుడు శ్రుతి హాసన్ చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. రెండు సినిమాలు హిట్ అయినా కూడా ఆమెను ఎవ్వరూ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ సలార్ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంట్లోనే వర్కైట్లు అంటూ శంతనుతో ఫుల్ బిజీగా ఉంటోంది.


Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్


గత మూడు నాలుగు రోజులుగా శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా? అని అందరూ అనుకున్నారు. అయితే శ్రుతి హాసన్‌కు వైరల్ ఫీవర్ వచ్చిందని, అందుకే ఇలా సైలెంట్ అయిపోయిందని, రెస్ట్ తీసుకుంటూ ఉండటం వల్లే ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిందని తెలుస్తోంది. తాజాగా ఆమె వైరల్ ఫీవర్ నుంచి కోలుకోవడం మళ్లీ జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ వస్తోంది. అంతే కాకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు సైతం చెక్కేసింది.


Also Read:  Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook