Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీతో (director bobby) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహిళా దినోత్సవం (Women's day) సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ (Shruti Haasan) నటించనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. వెల్ కమ్ శ్రుతి హాసన్ అంటూ మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇతర సినిమాల విషయానికొస్తే...చిరంజీవి (Megastar Chiranjeevi) ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య'  (Acharya) మూవీని పూర్తి చేశారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళాశంకర్ చిత్రాల్లో నటిస్తున్నారు. క్రాక్ సూపర్ హిట్ తర్వాత శ్రుతి హాసన్ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు. అంతేకాకుండా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య జోడీగా నటిస్తోంది. ఇటీవల శ్రుతికి కొవిడ్ సోకిన సంగతి తెలిసిందే. 



Also Read: Prabhas Thanks CM Jagan: సీఎం జగన్‌కు ప్రభాస్ కృతజ్ఞతలు.. సినిమా టికెట్ల ధరల పెంపుపై హర్షం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook