Shyam Singha Roy In Oscar Nominations Race For 3 Categories: చాలా కాలం తర్వాత నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా సాయి పల్లవి అలాగే కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ లు నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక సినిమాలో సాయి పల్లవి నటన, ఆమె పాత్రకు కూడా మంచి స్పందన దక్కింది. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉందని తెలుస్తోంది. మొత్తం మూడు విభాగాలలో ఈ సినిమాలో ఆస్కార్ కి నామినేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


క్లాసికల్ కల్చరల్ డాన్స్, పీరియాడిక్ ఫిలిం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే మూడు విభాగాలలో ఈ సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ దెబ్బతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక ఈ మూడు విభాగాలలో గనక నామినేషన్ జరిగి ఇందులో ఏ ఒక్క విభాగానికి అయినా ఆస్కార్ అవార్డు వస్తే కనుక టాలీవుడ్ కీర్తి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినట్లు అవుతుందని తెలుగు సినీ అభిమానులు భావిస్తున్నారు.


నిజానికి ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆయన ఆస్కార్ బరిలో నామినేట్ అయినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తరువాత అది కేవలం అంచనా అనే విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగ రాయ్ సినిమా నిజంగానే నామినేషన్ కు వెళుతుందా? లేక ఇవి కూడా అంచనాలేనా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.


ఇక శ్యామ్ సింగరాయ్ అనే సినిమా తర్వాత నాని దసరా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెలా అనే దర్శకుడు తెలుగు సినీ పరిశ్రమకు ఈ సినిమా ద్వారా  పరిచయమవుతున్నారు. ఇక శ్యాం సింగరాయ సినిమా విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. 


Also Read: Jabardasth Praveen : జబర్ధస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. కోలుకోలేని దుఖంలో ప్రవీణ్


Also Read: Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి