Shyam Singha Roy Second Single Nani, Krithi Shetty’s Edo Edo Full Lyrical Song out now: హీరో నాని టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ కాంబోలో వ‌స్తోన్న మూవీ శ్యామ్‌సింగ‌రాయ్. ఈ మూవీ నుంచి తాజాగా ఏదో ఏదో తెలియ‌ని లోక‌మా పాట‌ను మూవీ యూనిట్ విడుద‌ల చేసింది. ఏదో ఏదో తెలియ‌ని లోక‌మా... ఏదో ఏదో త‌హ త‌హ మైక‌మా....అంటూ స్లో మోష‌న్‌లో సాగుతున్న ఈ పాట ఆక‌ట్టుకునేలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నాని (Nani) ఈ మూవీలో శ్యామ్‌సింగ రాయ్‌ (Shyam Singha Roy), వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాసు పాత్రకు సంబంధించిన పాట ఇది. శ్యామ్‌సింగ రాయ్‌ పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్‌ సాంగ్‌ కూడా ఆకట్టుకుంది. 


కోల్‌క‌తా (Kolkata) బ్యాక్ డ్రాప్‌లో ఈ పాట ఉండ‌బోతున్న‌ట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. నాని, కృతిశెట్టి (Krithi Shetty) మ‌ధ్య‌ రొమాంటిక్ ట‌చ్‌తో సాగే ఈ పాట‌ లిరిక్స్ కృష్ణ‌కాంత్ (Krishnakanth) రాశారు. మిక్కీ జే మేయ‌ర్ (Mickey J Meyer) మ్యూజిక్ అందించారు. చైత్ర అంబ‌డి పూడి పాడారు.



Also Read : Drushyam 2 Review: ఊహించని ట్విస్టులతో 'దృశ్యం 2' మూవీ.. వెంకీ మామ నటన హైలెట్..!!


శ్యామ్ సింగ‌రాయ్ మూవీని నిహారిక ఎంట‌ర్‌టైన్ మెంట్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయిప‌ల్ల‌వి (Sai Pallavi), కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ లు నటిస్తున్నారు. డిసెంబ‌ర్ 24న తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో థియేట‌ర్ల‌లో శ్యామ్ సింగ‌రాయ్‌ రిలీజ్‌కానుంది. గతంలో క్రిస్‌మస్‌ రోజే రిలీజైన ఎమ్‌సీఏ పెద్ద హిట్టవడంతో ఇప్పుడు శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) కూడా హిట్‌ అవుతుందని నాని (Nani) ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.


Also Read : Siva Shankar master health condition: శివ శంకర్ మాస్టర్‌కి సోను సూద్ సహాయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook