Siddhanth Kapoor Arrest: బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు, నటి శ్రద్ధా కపూర్ సోదరుడు, నటుడు సిద్ధాంత్ కపూర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం (జూన్ 12) రాత్రి ఓ పార్టీలో పాల్గొన్న సిద్దాంత్ కపూర్ డ్రగ్స్ సేవించినట్లు తెలియడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే ఆ హోటల్‌ వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీలో పాల్గొన్నవారిలో డ్రగ్స్ సేవించినట్లు అనుమానం కలిగిన 35 మంది శాంపిల్స్‌ను పోలీసులు మెడికల్ టెస్టుల కోసం పంపించారు. ఇందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అవగా.. వీరిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పార్టీలోనే వీరు డ్రగ్స్ తీసుకున్నారా.. లేక డ్రగ్స్ తీసుకునే పార్టీకి వచ్చారా అనేది తేలాల్సి ఉంది. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన ఆరుగురిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.


సిద్ధాంత్ కపూర్ అరెస్ట్ గురించి తెలిసి అతని తండ్రి శక్తి కపూర్ షాకయ్యారు. 'నాకేమీ తెలియదు. నిద్ర లేవగానే ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉంది. నాకు తెలిసినంతవరకు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంతే.. అరెస్ట్ చేయలేదు.' అని పేర్కొన్నారు.


సిద్ధాంత్ కపూర్ సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన 'షూటవుట్ ఎట్ వడాలా'తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో అగ్లీ సినిమాలో ఓ పాత్రలో నటించారు. హసీనా పార్కర్ చిత్రంలో దావూద్ ఇబ్రహీం పాత్రలో కనిపించారు. చివరిసారిగా 'చెహ్రే' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం లవ్ రంజరన్ దర్శకత్వంలో రణబీర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ నటిస్తున్నాడు. 


కాగా, గతేడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్‌సీబీ దాడులు చేయగా.. అక్కడ ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్‌సీబీ క్లీన్ చిట్‌తో ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకొచ్చాడు. ఇంతలోనే మరో బాలీవుడ్ నటుడి కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. 


Also Read: Gouravelli Project: గౌరవెల్లి భూనిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి.. గుడాటిపల్లిలో హైటెన్షన్..  


Also Read: KCR NEW PARTY: ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్ స్కెచ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.