High Tension at Gouravelli Project: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గుడాటిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ తగులుతోంది. ట్రయల్ రన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో భూనిర్వాసితులతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి.బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూనిర్వాసితుల అరెస్టులను బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కూడా ఖండించారు. నిర్వాసితులపై దాడి సిగ్గుచేటని.. పరిహారం చెల్లించకుండానే వారిని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కాగా, రీడిజైన్‌లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టును 1.4 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ వారంలోనే ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు ఎక్కడ ట్రయల్ రన్‌ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండానే ట్రయల్ రన్‌కు సిద్ధపడటమేంటని ప్రశ్నిస్తున్నారు.
నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి.బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి
సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నావారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది pic.twitter.com/i0arUrBOq2
— Revanth Reddy (@revanth_anumula) June 13, 2022
Also Read: KCR NEW PARTY: ఉండవల్లికి బీఆర్ఎస్ పార్టీ ఏపీ బాధ్యతలు? పీకే డైరెక్షన్ లో కేసీఆర్ స్కెచ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.