Siddharth-Aditi Rao Marriage: అదితి రావు తో సిద్ధార్థ పెళ్లి.. గుడిలో ఒకటైన జంట!
Siddharth-Aditi Rao: కోలీవుడ్ హీరో సిద్ధార్థ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు అని ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.తెలుగు నటి అదితి రావు హైదరీని తో చాలా సీక్రెట్ గా సిద్ధార్థ పెళ్లి జరిగిపోయిందట.
Siddharth-Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,బాయ్స్ లాంటి యూత్ ఫుల్ మూవీస్ తో అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్. అయితే ఆ తర్వాత మెల్లిగా సినిమా చాన్సులు తగ్గడంతో కెరీర్ లో అతను కొన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాడు. కమల్ హాసన్ భారతీయుడు 2లో సిద్ధార్థ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
గతంలో సిద్ధార్థ సమంతతో ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. చాలా కాలం తర్వాత తిరిగి అదితి రావు హైదరి తో సిద్ధార్థ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీటికి తగినట్లుగానే ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరగడం.. పార్టీలకు కలిసి హాజరు కావడం.. ఒకరి ఇంట్లో మరొకరు కనిపించడం ఈ వార్తను మరింత వైరల్ చేసింది.
సిద్ధార్థ గతంలో మేఘన నారాయణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అదితికి కూడా సత్యదేవ్ మిశ్రా తో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ వేరువేరు కారణాలతో తమ పార్ట్నర్స్ నుంచి విడిపోయారు. 2021 లో వచ్చిన శర్వానంద్ మహాసముద్రం చిత్రంలో సిద్ధార్థ, అదితి కూడా నటించారు. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారి చివరకు సహజీవనం చేసేటంతవరకు వెళ్ళింది. తమ పెళ్లిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు అని అందరూ ఎదురు చూస్తున్న టైం లో ఎవరికీ తెలియకుండా ఇద్దరు సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్నారు అని వినికిడి. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ ఇద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య గుట్టుగా జరిగిపోయిందిమట. ఇంతకీ పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు జరిగింది అంటే.. వనపర్తి సంస్థానాధీశుల వారసులలో అదితి రావు హైదరి కూడా ఉన్నారట. అందుకే తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఈ గుడిలో ఇద్దరి వివాహం జరిగింది. పెళ్లి తంతును మొత్తం తమిళ పండితులు దగ్గర ఉండి జరిపించారు అని కూడా తెలుస్తోంది .పెళ్లికి ముందు ఇద్దరి నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏదేమైనాప్పటికీ గుట్టుగా పెళ్లి చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈ జంటకి నెటిజెన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ వార్త గురించి మీరిద్దరిలో ఎవరైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
Also Read: Fishing Ban: 'ఉప్పెన' సినిమా పునరావృతం.. ఇకపై సముద్రంలో ఆ "పని" నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter