Tillu Square Release Update: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నయా మూవీ 'టిల్లు స్క్వేర్'(Tillu Square ). మల్లిక్‌రామ్ (Mallik Ram) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నిర్మాణంలో  ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ కూడా భాగమైంది. ఈ మూవీకి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో టిల్లు మెడ‌లో రుద్రాక్ష మాల వేసుకుని బ్లాక్ స్టైలిష్ గాగుల్స్‌ను పెట్టుకుని క‌నిపిస్తున్నాడు. అంతేకాకండా టిల్లు స్క్వేర్ కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ ట్వీట్ చేశారు. ''ప్రస్తుతం టిల్లు స్క్వేర్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ముందుగా ప్ర‌క‌టించిన తేదీకి (సెప్టెంబ‌ర్ 15)న సినిమాను విడుద‌ల చేయ‌లేక‌పోతున్నాం. క్ష‌మించండి.. అంటూ'' మేకర్స్ పోస్ట్ పెట్టారు. 



ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన  టికెటే కొనకుండా (Ticket Eh Konakunda) సాంగ్‌ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. ఇందులో సిద్దూ, అనుపమ పరమేశ్వరన్ కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన పాటను రామ్ మిర్యాల అలపించాడు.  సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ కథని అందిస్తుండగా మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సెప్టెంబరు రేసు నుంచి సలార్ తప్పుకోగా.. తాజాగా టిల్లు స్క్వేర్ కూడా వెనకడుగు వేసింది.


Also Read: Kushi: బాక్సాఫీస్ వద్ద 'ఖుషి' ప్రభంజనం.. రూ.75 కోట్ల దిశగా విజయ్ దేవరకొండ మూవీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook