Kushi: బాక్సాఫీస్ వద్ద 'ఖుషి' ప్రభంజనం.. రూ.75 కోట్ల దిశగా విజయ్ దేవరకొండ మూవీ..

Kushi Movie: విజయ్ దేవరకొండ నయూ మూవీ ఖుషి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.75 కోట్ల మార్కుకు చేరువైంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 06:45 PM IST
Kushi: బాక్సాఫీస్ వద్ద 'ఖుషి' ప్రభంజనం.. రూ.75 కోట్ల దిశగా విజయ్ దేవరకొండ మూవీ..

Kushi 3 Days Worldwide Collection: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. శివనిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన రోజు నుంచి ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును క్రాస్ చేసింది. వీకెండ్ కావడంతో మూడో రోజు కూడా భారీగానే వసూళ్లు సాధించింది ఈ మూవీ. ఆదివారం ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.36 కోట్ల(నెట్) రాబట్టినట్లు తెలుస్తోంది. ఇండియాలో రూ.11 కోట్లు (నెట్) వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.75 కోట్ల మార్కుకు దిశగా దూసుకెళ్తుంది. ఇండియాతోపాటు యూఎస్‌లో కూడా భారీగానే కలెక్షన్లు రాబడుతుంది ఖుషి. 

ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ, లక్ష్మి మరియు రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా మురళి జి మరియు ఎడిటర్ గా ప్రవీణ్ పూడి పనిచేశారు. ఖుషి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. అంతేకాకుండా హైదరాబాద్ సంధ్య థియేటర్లలో ఫ్యాన్స్ తో కలిసి ఖుషి మూవీని వీక్షించారు. విజయ్ త్వరలో గౌతమ్ తిన్ననూరి చిత్రంలో నటించనున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. VD 12 వర్కింగ్ టైటిల్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. 

Also Read: Devara Update: సముద్రంలో ఎన్టీఆర్ భారీ యాక్షన్.. మూవీకి ఇదే హైలెట్ అంట..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News