Mallik Ram : డిజాస్టర్ నుంచి సూపర్ హిట్.. టిల్లు స్క్వేర్ డైరెక్టర్ లక్కీ ఛాన్స్
Tillu Square Director: కొంతమందికి డైరెక్టర్లు మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్లు అందుకుని తరువాత ఫేడ్ అయిపోతూ ఉంటారు మరి కొందరు మాత్రం మొదట్లో ఎన్ని డిజాస్టర్లు అందుకున్న నెల తొక్కుకొని తమ సత్తా చాటుకుంటారు అలాంటి వారిలో తిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రాం కూడా ఒకరు.
Tillu Square Collections: నిన్న మొన్నటిదాకా ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే తెలిసిన డైరెక్టర్ మల్లిక్ రామ్.. కానీ ప్రస్తుతం ఆయన ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మారు మ్రోగి పోతోంది. దానికి కారణం టిల్లు స్క్వేర్ సినిమా. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మార్చ్ 29న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సినిమా కి సీక్వెల్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఫేమస్ అయిపోయారు.
2016లో సుమంత్ హీరోగా నటించిన నరుడా డోనరుడా సినిమాతో మల్లిక్ రామ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. హిందీలో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ సినిమా కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మాత్రం అంత మంచి రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది.
ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా అద్భుతం సినిమా ఓటిటి లలో విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కానీ టిల్లు స్క్వేర్ సినిమాతో ఇప్పుడు డైరెక్టర్ గా మల్లిక్ రామ్ తన సత్తా చాటుకుంటున్నారు. నిజానికి డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ కాబట్టి టిల్లు స్క్వేర్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా సీక్వెల్స్ టాలీవుడ్ లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే.
ఇలాంటి సమయంలో కూడా ప్రెషర్ ని తట్టుకుంటూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు మల్లిక్. అనుకున్నట్లుగానే తన కష్టానికి ప్రతిఫలంగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మొదటి వారాంతంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకుంది. చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ ఇతనిపై పెట్టుకున్న నమ్మకం కూడా వమ్ము కాలేదు.
టిల్లు క్యారెక్టర్ ని మల్లిక్ రామ్ ఇంకా బాగా చూపించారు. తాజాగా ఇప్పుడు మల్లిక్ రామ్ తదుపరి సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మల్లిక్ తన నెక్స్ట్ సినిమాలతో ప్రేక్షకులను అంతే అలరిస్తూ మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటారో లేదో చూడాలి.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం
Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook