Singer Chinmayi Satires on Kamal Haasan ఇండియన్ రెజ్లర్లు వేధింపులకు వ్యతిరేకంగా గత నెల రోజులకు పైగా నిరసనలు చేపడుతూ రోడ్డు మీదకు ఎక్కిన సంగతి తెలిసిందే. భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజర్లర్లు రోడ్డుకు ఎక్కారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం తమ ఎంపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అటు రెజర్లర్లు మాత్రం నిరసనను ఆపడం లేదు. అయితే తాజాగా వారి నిరసన మీద కమల్ హాసన్ స్పందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజుకు రెజ్లర్లు నిరసన చేస్తూ నెల రోజులు దాటేసింది.. వాళ్లు మన దేశ పతాకం కోసం పోరాడాలి.. కానీ వారిని వారు కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తోంది.. అంటూ వారికే తన మద్దతు అంటూ.. ట్వీట్ వేశాడు కమల్ హాసన్. ఈ ట్వీట్ మీద చిన్మయి మండి పడింది. తన బాధనంతా ట్వీట్ రూపంలో పెట్టేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.


 



ఓ తమిళ గాయని గత ఐదేళ్లుగా నిధేషానికి గురవుతూనే ఉంది.. ఇదంతా కూడా ఓ మగాడి వేధింపులను వేలెత్తి చూపించినందుకు జరిగిందని అందరికీ తెలుసు.. ఇదంతా వారి కళ్ల ముందు, వారికి తెలిసిన పరిశ్రమలోనే జరుగుతోంది.. అలాంటప్పుడే నోరు మెదపలేదు.. అలాంటి రాజకీయ నాయకులు మహిళలకు అండగా ఉంటారని, రక్షణ కల్పిస్తారని ఎలా నమ్మేది.. అంటూ చిన్మయి మండి పడింది. ఇప్పుడు నా ట్వీట్ మీద కూడా తిడుతూ కొంత మంది నెటిజన్లు ట్వీట్లు వేస్తుంటారు.. అని ట్రోలింగ్ మీద కూడా ముందే స్పందించింది చిన్మయి.


Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?


పాటల రచయిత వైరముత్తు తనను వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని సింగర్ చిన్మయి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిన్మయి మీద తమిళనాడు బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. తమిళ డబ్బింగ్ యూనియన్ కూడా చిన్మయిని దూరం పెట్టి వేధించింది. వైరముత్తు మీద వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కోలీవుడ్ ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ రజని, కమల్ వంటి వారు ఈ విషయం మీద ఎప్పుడూ కూడా చిన్మయికి మద్దతు పలకలేదన్న సంగతి తెలిసిందే.


Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK