Singer Daler Mehndi jailed in Human trafficking case: ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దలేర్‌పై మానవ అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పాటియాలా కోర్టు 2 సంవత్సరాల శిక్షను సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. 2003 నాటి కేసులో ఎట్టకేలకు 19 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది. దలేర్‌తో పాటు అతని సోదరుడు షంషేర్ కూడా ఈ కేసులో శిక్ష అనుభవించాల్సి ఉంది కానీ ఆయన గతంలోనే అనారోగ్య కారణాలతో మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంసేర్ సింగ్‌పై మానవ అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఈ ఇద్దరిపై 31 కేసులు నమోదయ్యాయి. మీడియా కథనాల ప్రకారం, మనుషులను అక్రమంగా విదేశాలకు పంపడం ద్వారా వారు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దలేర్ మెహందీకి 15 ఏళ్ల తర్వాత అంటే 2018లో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, దలేర్ మెహందీ తరపు న్యాయవాది పాటియాలా కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేశారు, ఆ తర్వాత కోర్టు గురువారం నాడు 2018 నాటి నిర్ణయాన్ని సమర్థిస్తూ దలేర్ మెహందీని జైలుకు పంపింది.


తీర్పు అనంతరం దలేర్ మెహందీని కోర్టులో అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి జైలుకు పంపనున్నారు. 1998 - 1999 మధ్య, దలేర్ మెహందీ శాన్ ఫ్రాన్సిస్కో సహా న్యూజెర్సీలలో 10 మందిని అక్రమంగా వదిలి వచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. సోదరులిద్దరూ విదేశాలకు తీసుకెళ్లేందుకు పాసేజ్ మనీగా కోటి రూపాయలు వసూలు చేసేవారట. 2006లో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఆయన కార్యాలయంపై దాడి జరిగింది.


కేసు ఫైల్‌కు సంబంధించిన పత్రాలు అలాగే పాసేజ్ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. 2018లో పంజాబ్‌లోని పాటియాలా కోర్టు 2003 మానవ అక్రమ రవాణా కేసులో దలేర్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించినా శిక్ష ఖరారు చేసిన 30 నిమిషాలకే దలేర్ మెహందీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన కేవలం పంజాబీలోనే కాక తెలుగు సహా పలు ఇతర భాషల్లో సూపర్ హిట్ పాటలు పాడారు. బాహుబలి, యమదొంగ, బాద్షా, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలకు పాటలు పాడారు.  


Also Read: The Warriorr Review: పోలీస్ ఆఫీసర్గా రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే ?


Also Read: Kangana Ranaut Emergency: ఇందిరాగాంధీగా అదరకొట్టిన కంగ‌నా ర‌నౌత్‌.. ఎమ‌ర్జెన్సీ టీజ‌ర్ చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook