The Warriorr Review: పోలీస్ ఆఫీసర్గా రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే ?

Ram Pothineni's The Warriorr Review: రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ది వారియర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 06:42 PM IST
  • రామ్ హీరోగా ది వారియర్
  • జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • సినిమా ఎలా ఉందంటే
The Warriorr Review: పోలీస్ ఆఫీసర్గా రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే ?

Ram Pothineni's The Warriorr Review: రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ది వారియర్. రామ్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

ది వారియర్ కథ:
సత్య (రామ్ పోతినేని)  ఒక డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తి చేశాక హౌస్ సర్జన్ చేయడం కోసం కర్నూల్ వెళతాడు. రోడ్డు మీద ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడతాడు సత్య. అయితే గురు (ఆది పినిశెట్టి) గ్యాంగ్ ఆసుపత్రికి వచ్చి మరీ సత్య కాపాడిన మనిషిని చంపేస్తారు. దాంతో గురు మీద సత్య పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. దీంతో సత్యను కొండారెడ్డి బురుజు దగ్గర గురు అండ్ కో చావ కొడతాడు. అయితే సత్య ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా చావు దెబ్బలు తిని కర్నూల్ వదిలి వెళ్తాడు. అయితే రెండేళ్ల తర్వాత అదే కర్నూల్‌కు ఐపీఎస్ గా మారి డీసీపీ స్థాయిలో వస్తాడు. వచ్చిన తర్వాత సత్య గురును ఏం చేశాడు? సత్య జీవితంలో ఆర్జే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ది వారియర్ మూవీ విశ్లేషణ
సినిమా మొత్తం కూడా ఎక్కడా కొత్తదనం లేనట్లే కనిపిస్తుంది. అన్యాయాన్ని ఎదిరించే ఒక వ్యక్తి, ఆ అన్యాయం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్లే విలన్ అంటూ సాగిపోతుంది. మధ్యలో హీరోయిన్ ట్రాక్ ఇలా సాధారణంగా వారియర్ కథ సాగిపోతూ ఉంటుంది. కేవలం పాత్రల పరిచయానికి ఫస్ట్ ఆఫ్ వరకు టైం తీసుకున్నాడు దర్శకుడు. డాక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడు ఆ పోలీస్ ఆఫీసర్ గా మారి తాను పోలీస్ ఆఫీసర్ గా మారడానికి కారణమైన వ్యక్తిని ఎలా దారిలోకి తీసుకొచ్చాడు అనేది ఒక రకంగా ఈ సినిమా కథ. డాక్టర్ పోలీసుగా మారడం తప్ప మరెక్కడా కొత్తదనం కనిపించలేదు. పూర్తిస్థాయి రొటీన్ డ్రామాగా సాగిపోతుంది. తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం మీద కూడా ప్రేక్షకుడు ఈజీగా ఒక అంచనాకు వచ్చేస్తాడు. అయితే డాక్టర్ పోలీస్ ఆఫీసర్గా మారడం అనే  విషయంలోనే కొత్తదనం ఉంది తప్ప మిగతా కథ, కథనం అంతా కూడా ఇదివరకు ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. అయితే చాలావరకు ఎంటర్టైనింగ్ వేలో తీసుకువెళ్లేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అందులో కొంతమేర సఫలం అయ్యారు. ముఖ్యంగా కృతి శెట్టి కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా రామ్ డాక్టర్గా అలరించి సెకండ్ ఆఫ్ అయ్యేటప్పటికి ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ గా మారతాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే 
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ ఒక డాక్టర్ గా తర్వాత పోలీస్ ఆఫీసర్ గా రెండు భిన్న పాత్రలు పోషించి రెండింటిని మేనేజ్ చేస్తూ మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. కృతి శెట్టి కూడా సినిమా మొత్తం మీద అందంగా కనిపించింది. అలాగే ఆమె పాత్రతో వినోదం చేయించడం కూడా కాస్త ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఇక విలన్ గురు పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. ఆ పాత్రకు ఆయన తప్ప మరొక ఛాయిస్ లేదా అనే అంతలా ఆయన రాయలసీమ యాసలో తనదైన శైలిలో నటించి మెప్పించాడు.. రామ్ తల్లిగా నదియా కూడా తన పాత్ర పరిధి మీద నటించి మెప్పించింది అయితే ఎక్కువగా రామ్ ఆది పినిశెట్టి మధ్య పోరాట దృశ్యాలే కనిపిస్తూ ఉండడంతో మిగతా పాత్రలకు నటించే అవకాశం కూడా దక్కలేదని చెప్పాలి. 

టెక్నికల్ టీం 
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో మూడు పాటలు బాగా సెట్ అయ్యాయి. అయితే ఆయన అందించిన నేపథ్య సంగీతం మాత్రం ఒక ప్యూర్ మాస్ సినిమాకి తగ్గట్లుగా లేదు అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టు సెట్ అయింది. కొత్త నిర్మాణ సంస్థే అయినా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి, కాకపోతే ఎడిటింగ్ టేబుల్ మీద కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలాగే   లిప్ సింక్ లేని డబ్బింగ్ ఇబ్బంది పెడుతుంది.

ఫైనల్ గా చెప్పాలంటే 
ది వారియర్ పోలీసుగా మారిన డాక్టర్ కధ. రొటీన్ స్టోరీనే కానీ ఒకసారి ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగిన సినిమా. 

ది వారియర్ రేటింగ్: 2.5/5

నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, న‌దియా, అక్షర గౌడ‌, బ్రహ్మాజీ, పోసాని కృష్ణముర‌ళి త‌దిత‌రులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శక‌త్వం: ఎన్‌. లింగుస్వామి 
మాటలు: సాయిమాధవ్ బుర్రా, లింగుస్వామి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి

Also Read: Kangana Ranaut Emergency: ఇందిరాగాంధీగా అదరకొట్టిన కంగ‌నా ర‌నౌత్‌.. ఎమ‌ర్జెన్సీ టీజ‌ర్ చూశారా?

Also Read: Salaried Wife Offer to Neetu Chandra: జీతం తీసుకునే పెళ్లాంగా ఉంటే నెలకు 25 లక్షలు.. దారుణమైన విషయం బయటపెట్టిన నీతూ చంద్ర! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News