Singer Mangli Appointed as SVBC Advisor: తెలుగులో సింగర్ మంగ్లీగా ఫేమస్ అయిన సత్యవతి రాథోడ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఆమె 28 ఏళ్ళ వయసులోనే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా నియమితులయ్యారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఆమెను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆమ్నె నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండేళ్ళ పాటు ఈ పదవిలో మంగ్లీ ఉండనుంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సుంకిడి అనే గ్రామంలో జన్మించారు. అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా పూర్తి చేసిన ఆమె తర్వాత మ్యూజిక్ టీచర్ అవ్వాలనుకుంది. అయితే హైదరాబాద్ వచ్చి యాంకర్ గా మొదలుపెట్టి తర్వాత సింగర్ గా మారింది. స్వేచ్ఛ అనే సినిమాలో తొలుత నటిగా మారిన ఆమె ఆ తర్వాత గువ్వా గోరింక అనే సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది.


తర్వాత మాస్ట్రో అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించింది. ఇక సినిమా సాంగ్స్ లో  కూడా ఆమె తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళింది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో శైలజ రెడ్డి అల్లుడు చూడు అనే సాంగ్ తో తన సింగింగ్ కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత నీది నాది ఒకే కథ, జార్జిరెడ్డి, అల వైకుంఠపురంలో, నాగభైరవి, ఏ వన్ ఎక్స్ప్రెస్, సిటీ మార్, లవ్ స్టోరీ, రంగ్ దే, రాబర్ట్, రాధాకృష్ణ, అల్లుడు అదుర్స్, క్రాక్, జెట్టి, గల్లీ రౌడీ, పెళ్ళిసందడి, పుష్ప, రౌడీ బాయ్స్, గోల్మాల్, హీరో, సేహరి, టెన్త్ క్లాస్ డైరీస్, విక్రాంత్ రోనా, ట్రిపుల్ రైడింగ్, దిల్ పర్సన్, ధమాకా వంటి సినిమాలకు తన గాత్రాన్ని అందించింది. ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఆమె ఎన్నో పాడింది. అయితే ఆమె పాడిన రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న అనే సాంగ్ ఆమెకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ పదవి రావడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. 
Also Read: Manushi Chhillar: పెళ్లైన వ్యక్తి ప్రేమలో మానుషి.. కోటీశ్వరుడేనండోయ్, బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?


Also Read: Dil Raju Comments: నీ ధైర్యం ఏంటి?.. స్టేజ్ మీదే నిర్మాతను ప్రశ్నించిన దిల్ రాజు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook