Singer Mangli: ప్రముఖ సినీ నేపథ్య గాయని మంగ్లీ (సత్యవతి రాథోడ్)కు తృటిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనక నుంచి డీసీఎం ఢీ కొన్న ఘటన శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. శంషాబాద్ పోలీసుల తెలిపిన విరవాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్.. మనోహర్ కలిసి ఆమె కారులో హైదరాబాద్‌ బెంగళూరు నేషనల్ హైవే మీదుగా ఇంటికి బయలు దేరారు. ఈమె ప్రయాణిస్తోన్న వాహనం తొండుపల్లి బ్రిడ్డ వద్దకు రాగానే కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీసీఎం వ్యాన్ వెనక నుంచి వేగంగా వచ్చి వీరు కారను డీ కొట్టింది. ఐతే.. వీరు సీటు బెల్టు ధరించడంతో కారులో ప్రయాణిస్తోన్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు వెనక భాగం నుజ్జు నుజ్జు అయింది. అయితే డీసీఎం డ్రైవరు ఫుల్లుగా మద్యం తాగి ఆ మత్తులో మంగ్లీ ప్రయాణిస్తోన్న కారును ఢీ కొట్టాడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింగర్ మంగ్లీ విషయానికొస్తే.. ఈమె సింగర్‌గా నుంచి హీరోయిన్‌గా ఓ కన్నడ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఈమె త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఆమె సమీప బంధువుతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమచారం. జానపద పాటలతో ఫేమసైన మంగ్లీ ఆ తర్వాత సింగర్‌గా టాలీవుడ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఈమె చెల్లెలు ఇంద్రావతి చౌహాన్..పుష్ప సినిమాలో ఊ.. అంటావా పాటతో సింగర్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే కదా.


ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి