Telangana SSC Hall Tickets 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS Tenth Hall Tickets 2024 Download: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ  ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి ససంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పదో తరగతి హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2024, 12:21 PM IST
Telangana SSC Hall Tickets 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Telangana SSC Hall Tickets Download: తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో అంటే మార్చ్ 18 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి పరీక్షల కోసం  రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో ఈసారి ఫిజికల్ సైన్స్, బయోలజీ రెండూ వేర్వేరుగా జరగనున్నాయి. ఇవాళ పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. 

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్, హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18 నుంచి ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలజీ పరీక్షలు మాత్రం రెండు గంటలపాటే జరగనున్నాయి. పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్‌కు అనుమతి లేదు. పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ముందుగా  bse.telangana.gov.in ఓపెన్ చేయాలి. ఆ తరువాత SSC Examination March-2024 ఆప్షన్ క్లిక్ చేయాలి. పుట్టిన తేదీ, పాఠశాల పేరు, జిల్లా పేరు నమోదు చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. అంతే హాల్ టికెట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. 

తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్

మార్చ్ 18న ఫస్ట్ లాంగ్వేజ్
మార్చ్ 19న సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 21న థర్డ్ లాంగ్వేజ్
మార్చ్ 23న మేథ్స్
మార్చ్ 26న సైన్స్ పేపర్ 1 ( ఫిజిక్స్)
మార్చ్ 28న సైన్స్ పేపర్ 2 ( బయోలజి)
మార్చ్ 30న సోషల్ స్టడీస్

గతంలో పదో తరగతి పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ వంటి పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. 

Also read: Telangana Schools: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ కీలక నిర్ణయం..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News