Sita First Look From Prabhas Adipurush ఓం రౌత్ ప్రభాస్ కాంబోలో రాబోతోన్న ఆదిపురుష్‌ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇక ఆదిపురుష్‌ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేశారు. సీతానవమి సందర్భంగా ఆదిపురుష్‌ నుంచి సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక అశోక వనంలో సీత బాధపడుతున్న సందర్భంలోని లుక్‌ను విడుదల చేసినట్టుగా అనిపిస్తోంది. సీతగా కృతి సనన్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ మెప్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిపురుష్ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం నాసిరకమైన వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ వల్ల వాయిదాలు పడుతూనే వస్తోంది. టీజర్‌లో ఉన్న విజువల్స్, గ్రాఫిక్స్‌కు జనాలు పెదవి విరిచారు. దీంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ గ్రాఫిక్స్‌ను, విజువల్స్‌ను కాస్త బెటర్‌ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అందులో ఎలాంటి మార్పులు రానట్టుగా కనిపిస్తోంది.


 



ఇక ఈ సినిమాను మొబైల్స్‌లో చూసేందుకు తీయలేదని, బిగ్ స్క్రీన్‌లో త్రీడీ ఎఫెక్ట్స్‌లో చూడాలని, అప్పుడే మ్యాజిక్ తెలుస్తుందని, ఎక్స్ పీరియెన్స్ చేస్తారని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. అయితే చివరకు రిపేర్లు చేసేందుకు బాగానే టైం తీసుకున్నాడు. కాస్త బెటర్మెంట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రికార్డులు బద్దలు చేస్తుందనేది నిజం. జూన్ 16న ఆదిపురుష్‌ హంగామా మాత్రం ఉంటుంది.


Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌


ఇప్పుడు సోషల్ మీడియాలో సీత పాత్రకు సంబంధించిన లుక్‌ వైరల్ అవుతోంది. అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం అంటూ సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేశారు. సీతగా కృతి సనన్ చక్కగా సరిపోయినట్టు కనిపిస్తోంది. ఇక సీతారాములుగా ప్రభాస్ కృతి సనన్ జోడిని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook