Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

Agent Twitter Review అక్కినేని అఖిల్‌ ఏజెంట్ మూవీ నేడు (ఏప్రిల్ 28) థియేటర్లోకి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చేసింది. అయితే అయ్యగారు హిట్ కొట్టినట్టే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 09:06 AM IST
  • నెట్టింట్లో అయ్యగారి హల్చల్
  • ఏజెంట్‌తో అఖిల్ అక్కినేని సందడి
  • ట్విట్టర్‌లో ఏజెంట్‌ టాక్ వైరల్
Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

Agent Twitter Review అక్కినేని అఖిల్‌ ఓ సరైన కమర్షియల్ హిట్ కోసం ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇన్ని రోజులు లవర్ బాయ్‌గా కనిపించి మెప్పించే ప్రయత్నం చేశాడు. ఏజెంట్‌ సినిమాతో వైల్డ్‌గా కనిపించి ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడు. అఖిల్ ఈ సినిమా కోసం ఎంతలా మారిపోయాడో అందరికీ తెలిసిందే. కండలు తిరిగిన దేహం కోసం బాగానే కష్టపడ్డాడు. అయితే అఖిల్ పడ్డ కష్టానికి నేడు (ఏప్రిల్ 28) ఫలితం దక్కబోతోన్నట్టుగా ఉంది. అఖిల్ ఏజెంట్ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ట్విట్టర్‌లో హల్చల్ చేస్తోంది.

ఏం తీశార్రా మూవీ.. ఎక్సలెంట్‌ అసలు.. సినిమా మొత్తం అదిరిపోయింది.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌ బాగున్నాయ్.. మిస్ అవ్వకండి అంటూ అఖిల్‌ ఏజెంట్ మూవీ గురించి ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. వార్నింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయాయి.. వీఎఫ్‌ఎక్స్, బీజీఎం దరిద్రంగా ఉంది.. ఈ సినిమాకు హీరోయిన్‌ మైనస్ అయ్యేలా ఉంది.. మమ్ముట్టి ఇంటెన్స్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.

అఖిల్ వన్ మెన్ షో.. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయ్.. లవ్ స్టోరీ, సాంగ్స్, బీజీఎం దారుణంగా ఉన్నాయ్ అని, ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం దుమ్ములేపేసేలా ఉన్నాయ్ అంటూ కామెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్.. అఖిల్ కారెక్టర్ బాగా డిజైన్ చేశారు.. ఇక సెకండాఫ్‌ కోసం వెయిటింగ్ అని ఇంకో నెటిజన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా తెలిపాడు. సంపత్ రాజ్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ మాత్రం కేక అని అంటున్నారు.

Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్

ఇంటర్వెల్‌కు ఇరవై నిమిషాల ముందు నుంచి అదిరిపోతుంది.. అంతా కూడా గూజ్‌బంప్స్ స్టఫ్.. అఖిల్ తన వైల్డ్ సైడ్‌ను చూపించాడు.. అని ఇలా కొంత మంది పాజిటివ్ ట్వీట్లు వేస్తుంటే.. సినిమా పోయిందని, ఏం బాగా లేదని, వేస్ట్ సినిమా అని, ఏజెంట్ సినిమాలోని గోవిందా గోవిందా పాటతో సినిమా కూడా గోవిందా అన్నట్టుగా కౌంటర్లు వేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద పూర్తి స్థాయి రిజల్ట్ తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read:  Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News