Siva Shankar master health condition: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనావైరస్ బారినపడి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నిన్నటి నుంచి వార్తల్లో చూస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అవార్డు విన్నింగ్ డ్యాన్స్ మాస్టర్ అయిన శివ శంకర్ మాస్టర్ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అతడి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులు భరించడం కూడా ఇబ్బందిగానే ఉందనేది ఆయా వార్తా కథనాల సారాంశం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివ శంకర్ మాస్టార్ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న రియల్ స్టార్ హీరో సోనూ సూద్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా నిలిచిన సోనూ సూద్.. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చులు అన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సోనూ సూద్ సహాయంతో శివ శంకర్ కుటుంబంలో (Sonu Sood helps Siva Shankar master) ఆశలు చిగురించినట్టు మాస్టారు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 


Also read : Drushyam 2 Review: ఊహించని ట్విస్టులతో 'దృశ్యం 2' మూవీ.. వెంకీ మామ నటన హైలెట్..!!


కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus pandemic) సమయంలో ఉపాధి కోల్పోయి, కరోనాతో అయిన వారిని కోల్పోయి, కరోనాతో బాధపడుతూ ఆక్సీజన్ లేక అవస్థలు పడిన ఎంతో మందికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ ఎప్పటికప్పుడు తన మంచితనాన్ని, మానవతా దృక్పథాన్ని పెంచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. తాజాగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం (Siva Shankar master's health condition) విషయంలో కూడా సోనూ సూద్ అదే చేశారు అని సినీ వర్గాలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Also read : Unstoppable : తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ని, ఏ ఫంక్షన్‌కు వెళ్లినా వదిలిపెట్టరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook