Sivakarthikeyan: తమిళ హీరో శివ కార్తికేయన్  ఇప్పుడు టాక్ ఆఫ్​ ది కోలీవుడ్​గా మారాడు. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతుండటమే ఇందుకు (Sivakarthikeyan Hits) కారణంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కేరీర్ ప్రారంభించి.. హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ ఇటీవల ప్రోడ్యూసర్​గా కూడా మారారు. తాను హీరోగా నటించిన తాజా చిత్రం వరుణ్ డాక్టర్​కు (Doctor Film news) ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.


ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం సాధించింది. ఈ నెల ఆరంభంలో సినిమా రూ.100 కోట్ల క్లబ్​లో కూడా చేరింది. దీనితో వరుస విజయాలతో జోష్​లో ఉన్న శివకార్తికేయన్​.. రెమ్యూనరేషన్​ పెంచినట్లు కోలీవుడ్ (Kollywood talk on Siva karthikeyan) వర్గాల్లో టాక్ నడుస్తోంది.


కోలీవుడ్ అగ్రహీరోలకు పోటీగా.. శివ కార్తికేయన్​ రూ.27-రూ.35 కోట్ల వరకు (Sivakarthikeyan Remuneration) డిమాండ్​ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్​.


Also read: దక్షిణాది అగ్రనటి నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు


Also read: సరోగసి ద్వారా కవలలకు తల్లి అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింటా


వరుణ్ డాక్టర్ హిట్టుతో జోరు..


కరోనా రెండో దశ తర్వాత నేరుగా థియేటర్లలో విడుదలైన వరుణ్ డాక్టర్ (తమిళంలో డాక్టర్) మంచి విజయం (Varun Doctor) సాధించింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడుతు వచ్చంది. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.


ఇటీవలే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్​లో చేరింది. ఇదే సమయంలో శివకార్తికేయన్ రెమ్యూనరేషన్​ పెంచినట్లు కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


Also read: ఆర్ఆర్ఆర్ : ఆ పోస్టుకు నాలుగేళ్లు, 50 రోజుల్లో మ్యాజిక్ రిపీట్


వరుణ్ డాక్టర్ మూవీ గురించి..


ఈ సినిమాలో శివకార్తికేయన్​కు జంటగా.. నాని గ్యాంగ్​ లీడర్ ఫేమ్​  ప్రియాంక అరుళ్ మోహ‌న్‌ హీరోయిన్​. యోగిబాబు, విన‌య్ రాయ్‌, మిలింద్ సోమ‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. నెల్సన్​ దిలీప్ కుమార్​ దర్శకత్వం వహించగా.. అనిరుధ్​ మ్యూజిక్ అందించారు.


ప్రస్తుతం శివ కార్తికేయన్ అయ‌లాన్‌, డాన్ సినిమాల్లో న‌టిస్తున్నారు. అయ‌లాన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటోంది. డాన్​ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే సన్​ పిక్చర్​ నిర్మాణంలో మరోసినిమాకు సైన్  చేశారు శివకార్తికేయన్​.


Also read: మెగాస్టార్ చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్...'గాడ్​ఫాదర్' మూవీ నుంచి నయన్ పోస్టర్ రిలీజ్..


Also read: స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి