మెగాస్టార్ చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్...'గాడ్​ఫాదర్' మూవీ నుంచి నయన్ పోస్టర్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించడం దాదాపు ఖరారైంది. నయన్ పుట్టినరోజు  సందర్భంగా 'గాడ్​ఫాదర్' చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్​ రిలీజ్ చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 04:01 PM IST
మెగాస్టార్  చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్...'గాడ్​ఫాదర్' మూవీ నుంచి నయన్ పోస్టర్ రిలీజ్..

Godfather movie: మలయాళ చిత్రం 'లూసిఫర్'కు రీమేక్​గా తెరకెక్కుతున్న చిత్రం 'గాడ్​ఫాదర్'(godfather movie). మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఆయన చెల్లెలుగా నటించనున్నట్లు సమాచారం. లేడీ సూపర్ స్టార్  పుట్టినరోజు(nayanthara birthday)  సందర్భంగా..గాడ్ ఫాదర్ చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇంతకుముందు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో(sye raa narasimha reddy movie) చిరు, నయన్ జంటగా నటించారు. 

Also read: దక్షిణాది అగ్రనటి నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు

తమిళస్టార్ డైరెక్టర్ మోహన్​రాజా 'గాడ్​ఫాదర్' సినిమాకు(chiranjeevi godfather movie) దర్శకత్వం వహిస్తున్నారు.  ఒరిజినల్​లో 'మంజూ వారియర్' చేసిన పాత్రనే తెలుగులో నయన పోషిస్తోంది. ఈ చిత్రంలో ఈమెకు రెండో భర్తగా యువనటుడు సత్యదేవ్(satyadev movies) కనిపించనున్నారు. ఇతడే ప్రతినాయకుడు కూడా! సత్యదేవ్​కు భార్యగా నటించేందుకు నయన్ తొలుత ఒప్పుకోలేదని గత కొన్నిరోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.  అయితే ఇందులో నిజం లేదని తేల్చిన చిత్రబృందం.. సదరు వదంతులకు చెక్ పెట్టింది. వీరిద్దరూ జనవరి నుంచి షూటింగ్​కు వస్తారని సమాచారం. తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. సూపర్​గుడ్​ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

మరోవైపు చిరంజీవి 'ఆచార్య' కంప్లీట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. అలానే 'భోళాశంకర్'(bhola shankar 2021) షూటింగ్​లోనూ పాల్గొంటున్నారు. ఇందులో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. బాబీ దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమా ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News