దక్షిణాది అగ్రనటి నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Nayanathara Birthday: చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని రకాల కథాంశాల్లో చక్కగా నటించగల హీరోయిన్. అందంతో పాటు అభినయం కలిగిన నయనతార ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2021, 02:17 PM IST
దక్షిణాది అగ్రనటి నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Nayanathara Birthday: చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని రకాల కథాంశాల్లో చక్కగా నటించగల హీరోయిన్. అందంతో పాటు అభినయం కలిగిన నయనతార ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది.

దక్షిణాది నటీమణుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతార(Nayanathara). లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో లేడీ సూపర్‌స్టార్‌గా ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి..ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతోంది. అంతులేని అందం ఓ వైపు..చక్కని అభినయం మరోవైపు నయనతార సొంతం. వ్యక్తిత్వంతో..తనదైన శైలిలో దూసుకుపోతున్న నటి నయనతార. దక్షిణాదిన ఇంచుమించు అందరు నటీమణులతో జతకట్టింది. అందుకే నయనతారకు ఎప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

నయనతార (Nayanathara Birthday)ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది. 1984 నవంబర్ 18న పుట్టిన నయనతార అసలు పేరైతే డయానా మారియమ్ కురియన్. బెంగళూరులో జన్మించిన నయనతార కుటుంబ నేపధ్యం కేరళకు చెందింది. తండ్రి కురియన్ వైమానిక రంగ ఉద్యోగి. తల్లి ఒమన్ కురియన్. చిన్నప్పటి నుంచే నయనతారకు మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో ఆ రంగంలో చిన్న చిన్న షోలు చేసేది. మళయాళంలో విడుదలై మనస్పినక్కరే చిత్రంతో వెండితెరకు పరిచయమైన నయనతారకు నటిగా గుర్తింపు తెచ్చింది మాత్రం చంద్రలేఖ సినిమా. ఇక అప్పట్నించి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తమిళ, మళయాళీ భాషల్లో సూపర్‌హిట్ సినిమాల్ని ఖాతాలో జమ చేసుకు్ంది. అగ్రహీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటూ ఇప్పటికీ క్రేజ్ నిలబెట్టుకుంటోంది. హ్యాట్స్ ఆఫ్ టు నయనతార..విషింగ్ యూ ఎ హ్యాపీ బర్త్ డే(Happy Birthday Nayanathara).

Also read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆ ఐదు సిగరెట్ బ్రాండ్స్ ఏంటో తెలుసా..ధర వింటే ఆశ్చర్యమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News