Amaran Movie: ‘అమరన్’ సినిమా కోసం శివకార్తికేయన్, సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Amaran Movie: శివకార్తికేయన్ తమిళంలో అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు తెలుగులో ఇపుడిపుడే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కోసం శివకార్తికేయన్ తో పాటు సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ వార్తల్లో నిలుస్తోంది.
Amaran Movie: శివకార్తికేయన్ తెలుగులో ఇపుడిపుడే మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈయన సినిమాలకు తెలుగులో మంచి బిజినెస్ అవుతున్నాయి. తాజాగా ఈయన హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అమరన్’. ప్రముఖ సైనిక అధికారి ముకుంద్ వరదరాజన్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. ఇక అమరన్ అంటే ‘అమరుడు’ అని అర్ధం. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ భారీ ఎత్తున నిర్మించారు.
2019లో భారత దేశాన్ని కుదిపేసినా.. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘అమరన్’ చిత్రం.. రూ. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి.. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఇప్పటి వరకు రూ. 14 కోట్ల షేర్ (రూ. 24 కోట్ల గ్రాస్) వసూల్లతో దాదాపు రూ. 8 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. డబ్బింగ్ చిత్రాల్లో మరో హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. శివకార్తికేయన్ జాతీయ అవార్డు అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్ (రూ. 200 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 35 కోట్లకు పైగా లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా కోసం శివకార్తికేయన్ అందుకున్న రెమ్యునరేషన్ కూడా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. ఓ సైనికుడిగా కష్టపడ్డాడు. కండలు తిరిగిన మనిషిగా మారిపోయాడు. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు దాదాపు రూ. 30 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు రూ. 15 కోట్ల వరకు మాత్రమే పారితోషికం అందుకుంటున్న శివకార్తికేయన్.. ఈ సినిమా కోసం రూ. 30 కోట్లు అందుకోవడం మాములు విషయం కాదు.
మరోవైపు సాయి పల్లవి ఈ చిత్రంలో ముకుంద్ వరద రాజన్ భార్య వర్గీస్ రెబెక్క పాత్ర కోసం రూ. 3 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం. ఆర్మీలో దేశ శత్రువులతో పోరాడుతున్న భర్తకు దూరంగా జీవించే భార్య పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఈ సినిమాలో శివకార్తికేయన్ కంటే సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా యదార్ధ కథే అయినా.. ఈ సినిమాను భావోద్వేగాలతో తెరకెక్కించడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.