Chiranjeevi Rejected Movie Starring Balakrishna: ఏదైనా ఒక కథని రాసేటప్పుడు ఆ రైటర్ లేదా డైరెక్టర్.. ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని రాస్తారు. కొన్నిసార్లు ఆ హీరో బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్ బేస్ కి అనుగుణంగా ఆ కథని మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఆ కథ ఆ హీరోకి నచ్చకపోతే మరొక హీరో చేతుల్లోకి ఆ సినిమా వెళ్తుంది. అప్పుడు కథలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయేమో కానీ కథ మాత్రం అలాగే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక హీరోకి కథ నచ్చకపోతే.. లేదా ఆ హీరో కి డేట్ లో కుదరకపోతే.. ఆ కథ మరొక హీరో చేతుల్లోకి వెళుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణంగా జరిగే ఒక విషయం. అయితే ఇద్దరు ముగ్గురు హీరోలా చేతులు మారిన కథలు ఉన్నాయి కానీ.. ఒక కథ మాత్రం ఏకంగా ఆరుగురు హీరోల చేతులు మారిందట. ఆరుగురు హీరోలు ఒక కథ బాలేదు అని లేదా డేట్లు లేదు అంటూ రిజెక్ట్ చేశారు. 


కానీ అలాంటి ఒక సినిమాని ఒప్పుకొని చేసి.. సూపర్ హిట్ అందుకున్న ఘనత మాత్రం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కే దక్కింది. డైరెక్టర్ కే మురళీమోహన్ రావు చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో సంఘర్షణ అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ చిరంజీవితోనే కథానాయకుడు అనే టైటిల్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ కథలో హీరో పాత్ర కంటే శారదా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్న కారణంతో చిరంజీవి ఆ సినిమాకి నో చెప్పారట. ఆ తర్వాత హీరో కృష్ణతో సినిమా చేయాలని ఈ డైరెక్టర్ అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు. కృష్ణ తర్వాత సుమన్, కృష్ణంరాజు, రమేష్ బాబు ఇలా వరుసగా చాలామంది హీరోలు ఈ కథని రిజెక్ట్ చేశారు. 


ఆఖరిగా ఆ కథని బాలకృష్ణ దగ్గరికి తీసుకువెళ్లారు. బాలయ్య కూడా నువ్వు చెప్పే సినిమాని పక్కన పెట్టేద్దామని అనుకున్నారు. కానీ బాలయ్యకి కథ బాగా నచ్చింది. వెంటనే విజయశాంతిని హీరోయిన్గా పెట్టి సినిమా పట్టాలెక్కించేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డీ రామానాయుడు ఈ సినిమాని నిర్మించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అదే సినిమాని హిందీలో మిథున్ చక్రవర్తి, మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా దిల్వాలే అనే టైటిల్ తో నిర్మించారు. హిందీలో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.


Read more: Hydra Ranganath: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్ కు మరో అదిరిపోయే పోస్టు..?..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


 Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి