SJ Suryah about Pawan Kalyan: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న భారతీయుడు 2.. సినిమా జూలై 19 థియేటర్లలో విడుదలకాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ తో.. బిజీగా ఉంది ఈ నేపథ్యంలోనే జులై 7వ తేదీన హైదరాబాదులో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ తో పాటు సినిమాలో కీలక పాత్రలో పోషిస్తున్న సిద్ధార్థ, రకుల్ ప్రీత్, ఎస్ జే సూర్య కూడా ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో మాట్లాడుతూ.. ఎస్ జే సూర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా.. మారాయి. 


"ఎవరైతే దేశ మంచి కోసం గొప్ప పనులు చేశారో వాళ్ళ నిజమైన ఇండియన్స్. మీ అందరూ నిజమైన ఇండియన్స్. అందులో నాకు తెలిసిన మరొక ఇండియన్ నా స్నేహితుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా స్నేహితుడు అని నేను ఏదో ఒక రోజు గౌరవంగా చెబుతాను అని నేను మూడేళ్ల ముందే చెప్పాను. అందులో సగం నిజమైంది. మిగతా సగం మీరే నిజం చేయాలి" అంటూ ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ గురించి.. చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 


2000 లో ఎస్ జె సూర్య దర్శకత్వంలో.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ టాలీవుడ్ లో.. కల్ట్ క్లాసిక్ హిట్ సినిమాల్లో అది ఒకటి. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య స్నేహం.. కొనసాగుతూనే ఉంది. 


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయం తర్వాత భారతీయుడు 2.. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి.. మాట్లాడటంతో అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. 


భారతీయుడు 2 సినిమాలో మాత్రమే కాకుండా ఎస్ జె సూర్య నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న  గేమ్ చేంజర్ సినిమాలలో కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. 
మరోవైపు భారతీయుడు 2 సినిమా రెండు భాగాలుగా.. విడుదలకాబోతోంది. ఇందులో మొదటి భాగం భారతీయుడు.. జూలైలో విడుదల కాబోతుండగా భారతీయుడు 3 వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.


Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి