SKN: మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్న బేబి నిర్మాత ఎస్ కేఎన్..
SKN: ఎస్కేన్ తెలుగులో బేబి సినిమా నిర్మాతతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు ప్రొడ్యూసర్ ఎస్కేన్ కు మంచి పేరు వచ్చింది. అంతేకాదు ముందు నుంచి ఈయన పలు సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. తాజాగా ఈయన మరో సారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
SKN: ఛారిటీ యాక్టివిటీస్ లో ఎపుడు ముందుండే యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చే విషయాలపై స్పందించి సాయం చేయడంలో ముందుంటారు. తాజాగా ఆయన పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని జనసేన పార్టీ విరాళం ఇస్తానని ఓ మహిళ ఆనందంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది.
మరియమ్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్ కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన వెంటనే స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఈ రోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని గిఫ్ట్ గా ఇచ్చారు.
అంతేకాదు మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వడం, ఆ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ఎస్ కేఎన్ సేవాగుణాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎస్కేన్ విషయానికొస్తే.. బేబి సినిమాతో నిర్మాతగా మారారు. అంతేకాదు ఇపుడు పలు చిత్రాలను నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి