Snake Bit Salman Khan thrice, was hospitalised for 6 hours; Know Full Details : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బర్త్‌ డే నేడు. సల్లూ భాయ్‌ అంటే ఫ్యాన్స్‌కు పిచ్చి. భాయ్ పేరు వింటే బాక్సాఫీస్ షేక్‌ అవుతుంది.. భాయ్ మూవీ రిలీజైతే బాక్సాఫీస్ (Box office) బద్దలవుతుంది. తన కెరీర్‌‌లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు సల్మాన్. నేడు సల్మాన్‌ ఖాన్‌ 56వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.. ప్రపంచం నలు మూలల నుంచి సల్లూ భాయ్‌కి ఫ్యాన్స్ విషెస్‌ చెప్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన 56వ పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) మీడియాతో ముచ్చటించారు. సల్మాన్ ఖాన్ తన 56వ పుట్టినరోజును (Salman Khan birthday) సోమవారం తెల్లవారుజామున తన కుటుంబంతో కలిసి పాన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో (Farmhouse) జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రతి పుట్టిన రోజు మాదిరిగానే మీడియాతో మాట్లాడాడు సల్లూ భాయ్.


నిన్న సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైన విషయం తెలిసిందే. ఆ విషయంపై కూడా స్పందించారు సల్లూ భాయ్. పాన్వేల్‌లోని తన ఫౌంహౌస్‌ (Panvel farmhouse) చుట్టూ అటవీ ప్రాంతమే ఉందన్నారు. దాంతో ఫౌంహౌస్‌లో తరచూ పాములు తిరుగుతుంటాయని చెప్పారు. 


తన బర్త్‌డే (Birthday) వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో పాటు కొందరరు స్నేహితులు శనివారం రాత్రి పాన్వేల్‌లోని తన ఫౌంహౌస్‌కు వచ్చారన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ గదిలో పాము కనిపించిందని చెప్పారు సల్మాన్. అయితే అక్కడున్న వారంతా పాము.. పాము (Snake) అని కేకలు వేయడంతో...దాన్ని పట్టుకుని తిరిగి అడవిలోకి వదిలేద్దామనుకున్నాని చెప్పాడు సల్మాన్. 


వెంటనే ఆ పామును పట్టుకుని బయటకు తీసుకెళ్తుండగా.. అది తన చేతిపై మూడుసార్లు కాటు వేసిందన్నారు. వెంటనే తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది తనని హాస్పిటల్‌కు (Hospital‌) తీసుకెళ్లారని సల్మాన్ ఖాన్ (Salman Khan) తెలిపారు. అలా ఆరు గంటలు తాను డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు సల్మాన్. డిశ్ఛార్జ్‌ అయ్యాక తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఆ పాము విషపూరితమైనది కాదని తెలిపారు.


Also Read : Salman Khan Birthday: బాలీవుడ్ కండల వీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు


ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పాము మళ్లీ కనిపించిందని.. దానితో ఫోటో కూడా దిగాను అని చెప్పారు భాయీ జాన్‌. ఆ పామును తన ఫ్రెండ్‌గా భావిస్తున్నానని చెప్పారు సల్లూ భాయ్. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో (Rajamouli) తాను సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. రాజమౌళి గొప్ప డైరెక్టర్‌‌ అని ప్రశంసలు కురిపించారు సల్మాన్. 


రాజమౌళితో మూవీ చేసే ఛాన్స్‌ వస్తే తానెంతో సంతోషిస్తానని చెప్పారు. ప్రస్తుతం టైగర్‌ 3, కబీ ఈద్‌ కబీ దివాళి షూటింగ్స్‌లలో ఉన్నానని చెప్పుకొచ్చారు సల్లూ భాయ్. ఈ మూవీలు పూర్తయ్యాక భజరంగీ భాయిజాన్‌ (Bhajarangi Bhaijan‌) మూవీ సీక్వెల్‌లో నటించనున్నట్లు చెప్పారు. ఆ మూవీకి పవన్‌ పుత్ర భాయిజాన్‌ అని టైటిల్‌ ఖరారు అయినట్లు తెలిపారు సల్మాన్. ఈ మూవీకి రాజమౌళి తండ్రి కే విజయేంద్ర ప్రసాద్‌ (K Vijayendra Prasad‌) కథ అందిస్తున్నారని స్పష్టం చేశారు సల్మాన్ ఖాన్. (Salman Khan)


Also Read : Highest salary jobs: ఎక్కువ మొత్తంలో శాలరీ ఇచ్చే కంపెనీలు ఏంటో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి