Salman Khan: పాముకాటుకు గురైన సల్మాన్‌ ఖాన్, శనివారం రాత్రి ఘటన

Salman Khan: బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ పాముకాటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 01:19 PM IST
Salman Khan: పాముకాటుకు గురైన సల్మాన్‌ ఖాన్, శనివారం రాత్రి ఘటన

Salman Khan:  బాలీవుడ్ స్టార్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) పాముకాటుకు గురయ్యారు. పాన్వేల్‌లోని తన ఫాంహౌస్‌లో శనివారం రాత్రి ఆయనను పాము కరిచింది. దీంతో సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ని ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రి (MGM hospital)కి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. విషం లేని పాము కాటువేయడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. 

రేపు(డిసెంబరు 27) సల్మాన్ పుట్టినరోజు (Salman Birthday). ఈ నేపథ్యంలో తన బర్త్ డే వేడుకలను జరుపుకోవడానికి ముంబై వెలుపల ఉన్న తన పాన్వేల్ ఫాంహౌస్ (Panvel farmhouse) కు వెళ్లారు సల్మాన్. ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యం బాగానే ఉందని..ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని సల్మాన్ మేనేజర్ జోర్డీ పటేల్ వెల్లడించారు. మరోవైపు సల్మాన్‌ పాముకాటుకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  

Also Read: Sara Tendulkar Pics: హాలిడే ఎంజాయ్ చేస్తూ వివిధ దేశాల్లో సారా టెండూల్కర్

ఇటీవల 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సల్మాన్. ఆయుష్ శర్మ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం..విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. షారుఖ్ నటిస్తున్న 'పఠాన్' (Pathan) చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు సల్మాన్. నటుడు అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' (‘Laal Singh Chaddha’)లో అతిధి పాత్రలో కూడా కనిపిస్తున్నాడు సల్మాన్. ఇటీవలె ఈ స్టార్ హీరో 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్ ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News