Viral Video: ఓర్ని ఇదేంట్రా..?.. పెళ్లైన కొద్దిరోజులకే పబ్లిక్‌గా చిర్రు బుర్రులాడిన చైతు, శోభిత.. వీడియో ఇదిగో..
Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Naga chaitanya and Sobhita wedding: శోభిత , నాగచైతన్యల పెళ్లి ఇటీవల అన్న పూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన అనేక పిక్స్ వార్తలలో నిలిచాయి. వీరి పెళ్లి డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సంప్రదయ బద్దంగా జరిగినవిషయం తెలిసిందే. ఈ పెళ్లికి అన్ని రంగాల నుంచి కూడా ప్రముఖులు హజరైనట్లు తెలుస్తొంది. ఇటీవల పెళ్లి తర్వాత నాగార్జున,చైతు, శోభితలు శ్రీశైలంకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. పెళ్లి తర్వాత శోభితకు చెందిన అనేక ఫన్నీ డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
అదే విధంగా ఈ జంట తాజాగా.. అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా, షేన్ గ్రెగోయిర్ వివాహ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. అయితే.. ఇక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. సాధారణంగా సెలబ్రీటీలు అందులోను.. ఫెమస్ సెలబ్రీటీలు ఎక్కడకు వెళ్లిన కూడా కొంత మంది ఒక కన్నేసి ఉంచుతుంటారు. అయితే.. శోభిత, చైతు అటెండ్ అయిన వివాహా రిసెప్షన్ లో అక్కడి ఫోటో గ్రాఫర్ లు.. వీరిని ఫోటోలు తీసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తొంది.
శోభిత ఫోటోలు దిగేందుకు వెళ్దామంటే.. చైతుమాత్రం అంతగా ఆసక్తి చూపించలేదన్నట్లుతెలుస్తొంది. దీంతో పబ్లిక్ గానే.. కొంత సేపు వీరిద్దరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో చైతు వెళ్లి నువ్వే ఫోటోలు దిగమంటే.. శోభిత ఒక్కరే వెళ్లిపోయి ఫోటోలు దిగినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.అయితే.. కొంత మంది నెటిజన్లు మాత్రం వీరిద్దర మధ్య అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయని అంటున్నారంట.
Read more: Samantha: సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేసిన నాగచైతన్య..? అక్కడే బిగ్ ట్విస్ట్..! నెట్టింట వైరల్
మరికొందరు మాత్రం.. చైతు సింపుల్ గా ఉంటారు. తన భార్యను ఫోటోలు దిగేందుకు వెళ్లమన్నారు. అందులో తప్పేంటీ.. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దని అక్కినేని అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారంట. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తొంది.