Samantha: సమంతకు రూ.200 కోట్లు ఆఫర్‌ చేసిన నాగచైతన్య..? అక్కడే బిగ్‌ ట్విస్ట్‌..! నెట్టింట వైరల్

Samantha Naga chaitany: నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహం ఈనెల డిసెంబర్ 4వ తేదీన జరిగింది. అన్నపూర్ణ స్టూడియో వేదికగా వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు... అయితే అంతకుముందు సమంతతో పెళ్లి జరిగిన నాగచైతన్య అప్పట్లో రూ.200 కోట్లు విడాకుల సమయంలో ఆఫర్ చేశారని వార్త నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది..
 

1 /7

నాగచైతన్య శోభిత ధూళిపాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిరువురు పెద్దలను ఒప్పించి ఈ నెల డిసెంబర్ 4వ తేదీ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే అటెండ్‌ అయ్యారు.  

2 /7

ఇదిలాగా ఉండగా తాజాగా నాగచైతన్య సమంత విడాకులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

3 /7

సమంత నాగచైతన్యలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వీరు ఇరువురూ విడిపోయారు.. అయితే విడాకుల తీసుకునే సమయంలో కోర్టు సమంతకు భరణం చెల్లించాల్సిగా నాగచైతన్యకు ఆదేశించింది.  

4 /7

దీంతో నాగచైతన్య కుటుంబం సమంతకు రూ.200 కోట్లు ఆఫర్ చేశారట. అయితే సమంత  ససేమిరా అప్పట్లో భరణం తీసుకోలేదని వార్తలు వెళ్లు వెత్తాయి. ఒకవేళ తీసుకునే ఉంటే అప్పుడే భరణం గురించిన విషయం తెలిసిపోయేది. వార్తలు హల్‌ చల్‌ చేసేవి.  

5 /7

అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తర్వాత ఈ వార్త మళ్లి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఎంతోమంది సెలబ్రిటీలు విడాకుల తర్వాత భరణం తీసుకున్నారు. అదే సమంత విషయంలో జరగలేదా? అని చర్చించుకుంటున్నారు.  

6 /7

కానీ సమంత మాత్రం ఒక్క రూపాయి కూడా వద్దని ససేమీరా ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇద్దరం ఏకాభిప్రాయంతో విడిపోతున్నాం అని సమంత తీసుకోలేదట. సమంత ఇటీవల సీటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో అలరించింది.  

7 /7

ఇక నాగచైతన్య సినిమా జనవరిలో 'తండెల్' విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా మరోసారి నాగచైతన్యతో నటించింది. ఇదిలా ఉండగా నాగచైతన్య శోభిత దూళిపాలను రెండో వివాహం చేసుకున్నారు.‌