Sobhita Dhulipala Naga Chaitanya Dating శోభిత ధూళిపాళ నాగ చైతన్యలు డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు ఎంతగా వ్యాప్తి చెందాయో అందరికీ తెలిసిందే. మధ్యలో ఈ రూమర్లన్నీ కనిపించుకుండాపోయాయి. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. దీనికి ఓ ఫోటోనే కారణం. అయితే ఆ ఫోటో ఇప్పటిదా? పాతదా? అన్నది తెలియడం లేదు. ఎందుకంటే నాగ చైతన్య ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే ఉన్నాడు. నిన్ననే రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకల్లో మెరిశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ చైతన్య సమంత విడిపోయిన తరువాత అందరూ కూడా సమంతనే ట్రోల్ చేశారు. సమంత వల్లే విడిపోవాల్సి వచ్చిందని, నాగ చైతన్య మంచి వాడేనంటూ కామెంట్లు వచ్చాయి. అయితే కొన్ని రోజుల తరువాత నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్లు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై అక్కినేని అభిమానులు భగ్గుమన్నారు. ఇదంతా సమంత పీఆర్ టీం కావాలనే చేస్తోందంటూ మండి పడ్డారు.


అలా అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తుండటంతో.. సమంత స్పందించింది. అవే రూమర్లు మా మీద వస్తే.. నిజమని నమ్ముతారు.. కానీ మగాళ్ల మీద వస్తే మాత్రం పీఆర్ టీం చేయిందని అంటారా? అంటూ సమంత ఆ ఇష్యూ మీద మండి పడింది. ఇక సమంత రియాక్ట్ అవ్వడంతో శోభిత, నాగ చైతన్యల డేటింగ్ వార్తలు నిజమేనేమో అని అంతా అనుకున్నారు.


అయితే మళ్లీ ఇప్పుడు వీరిద్దరి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ చెఫ్‌ నాగ చైతన్యతో ఫోటో దిగాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి ఉంటాడు. ఆ ఫోటో ఇలా వైరల్ అవ్వడం, ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్‌లో శోభిత కనిపించడంతో డేటింగ్ రూమర్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఈ ఫోటో పాతదా? రీసెంట్‌దా? అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు. నిన్ననే రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకల్లో చైతూ సందడి చేసిన సంగతి తెలిసిందే.


Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook