Rashi Khanna Sensasional Comments on South Film Industry's: హీరోయిన్ రాశికన్నా.. దాదాపు దక్షణ భారతదేశంలోని అన్ని భాషలలో నటించింది. తమిళ్, మలయాళం, కన్నడ మరియు తెలుగు భాషలలో నటించి మెప్పించింది. 2013 లో మద్రాస్ కేఫ్ సినిమాతో తెరకు పరిచయమైన రాశి.. తెలుగులో ఊహలు 'గుసగుసలాడే' సినిమాతో తెలుగులో పరిచయం అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో హైపర్, బెంగాల్ టైగర్, వరల్డ్ ఫేమస్ లవర్, పవర్, వెంకీ మామ, శివమ్ సుప్రీమ్, లవకుశ వంటి తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 'రుద్ర'లో అజయ్ దేవగన్ తో నటించిన రాశిఖన్నా.. దక్షిణ భారత సినిమా పరిశ్రమలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 


'రుద్ర'తో తొమ్మిదేళ్ల తర్వాత బాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకుంది రాశీఖన్నా. అజయ్‌ దేవ్‌గణ్‌ సరసన నటించటం ఆనందంగా ఉందంది. తాజాగా దక్షిణాది చిత్రపరిశ్రమపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. సౌత్‌లో సినిమాలు ఆఫర్‌ కేవలం నటి అందాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇస్తారంది రాశి. దక్షిణాది చిత్రపరిశ్రమలో నటీమణులను గ్లామర్‌ డాల్‌ అని, గొప్ప నటి అని విభజించి చూస్తారంది. గ్లామర్ డాల్ అని ముద్ర  వేసి చాలా మంది తమ కథలకు సరిపోవని అవకాశాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది రాశి. ఆడిషన్స్‌ ఇస్తా... ఒక్కసారి చూసి నచ్చితేనే తీసుకోండని అడిగినా ఒప్పుకోలేదని రాశి వ్యాఖ్యానించింది.


దక్షిణాదిలో హిరోయిన్ అందం తప్ప టాలెంట్‌ను పట్టించుకోరంది. తననెవరూ ఒక మంచి నటిగా గుర్తించలేదని వాపోయింది. కేవలం ఒకే తరహా పాత్రల్లో నటించాల్సి వచ్చిందంది. తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి 'రుద్ర' మంచి అవకాశం కల్పించిందని రాశి పేర్కొంది. ఇకపై అన్నీ విభిన్నమైన చిత్రాలే చేసేలా చూసుకుంటానని రాశీ తెలిపింది. ఇక వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్‌ssగానే ఉంచాలనుకుంటానని.. పెళ్లి చేసుకుంటే తప్పకుండా అందరికీ చెబుతానంది రాశి.


Also Read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..


Also Read: SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్, భారీ జరిమానా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook