Nayanathara: దక్షిణాది అగ్రనటి నయనతార ఇప్పుడు బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తోంది. ఇప్పుడు మరో బిజినెస్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండే దక్షిణాది అగ్రనటి నయనతార. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపారాలతో బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవలే చాయ్ వాలే అనే ఫుడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. మరోవైపు ది లిప్ బామ్ కంపెనీ పేరుతో బ్యూటీ రిటైల్ బ్రాండ్ ప్రారంభించింది. ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమౌతోంది. దుబాయ్‌కు చెందిన ఓ ఆయిల్ కంపెనీలో వంద కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. 


ఈ మధ్యకాలంలో విఘ్నేష్ శివన్‌తో కలిసి దుబాయ్‌కు వెళ్లింది కూడా ఈ కారణంతోనేనని తెలుస్తోంది. నయనతార (Nayanathara) కొత్త బిజినెస్‌కు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్నాయి. నటనలో, అందంలో, అభినయంలో ఇప్పటికే ఎవర్‌గ్రీన్ అన్పించుకున్న నయనతార ఇప్పుడు వ్యాపారంలో కూడా అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతవరకూ సఫలమవుతుందో తెలియదు కానీ..నయనతార బిజినెస్ వంద కోట్ల బిజినెస్ వార్త మాత్రం హల్‌చల్ చేస్తోంది. 


Also read: Manchu Lakshmi Video: అరేయ్ ఏంట్రా ఇదీ విష్ణు ! నన్నే నీళ్లలో పడేస్తావా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook