Manchu Lakshmi Video: అరేయ్ ఏంట్రా ఇదీ విష్ణు ! నన్నే నీళ్లలో పడేస్తావా?

Manchu Lakshmi: నటి మంచు లక్ష్మికి  సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముందంటే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 02:39 PM IST
  • నటి మంచు లక్ష్మి వీడియో వైరల్
  • లక్ష్మిని ఫూల్‏లో పడేసిన విష్ణు, మోహన్ బాబు
Manchu Lakshmi Video: అరేయ్ ఏంట్రా ఇదీ విష్ణు ! నన్నే నీళ్లలో పడేస్తావా?

Manchu Lakshmi Video Viral: టాలీవుడ్ అగ్రకథానాయకుడు మోహన్ బాబు కూతురు మంచులక్ష్మీ (Manchu Lakshmi) గురించి అందరికీ తెలిసిన విషయమే. వ్యాఖ్యతగా, నటిగా తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీ. ఈ అమ్మడు వెండితెరపైనే కాదు..సోషల్ మీడియాలోనూ (Social Media) యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు కుటుంబ సంగతులు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఫన్నీ వీడియోను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. అందులో మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు కలిసి లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో ఎత్తిపడేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) త‌న కుటుంబ స‌భ్యుల‌ు ఒక్కొక్కరిని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేస్తూ ఉంటారు. అది వీడియో తీస్తూ ఉంటుంది మంచు ల‌క్ష్మి. ఇంత‌లో విష్ణు అంద‌రి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్క‌రు బ్యాలెన్స్ ఉన్నార‌నుకున్నాడు. వెంట‌నే ల‌క్ష్మి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు న‌డిచాడు. దీంతో విష‌యం అర్థ‌మైన ల‌క్ష్మి వ‌ద్దంటూ కేక‌లు పెట్టింది. అయిన‌ప్ప‌టికీ త‌గ్గేదేలే అంటూ మోహ‌న్‌బాబు (MohanBabu) సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్ల‌లో ప‌డేశారు. తండ్రి కూడా త‌న‌కు సాయం చేయ‌కుండా విష్ణుకే స‌పోర్ట్ చేసి పూల్‌లో పడేసినందుకు ఆమె కాస్త కోపంతో అరుస్తుంది. అంతా నా క‌ర్మ అంటూ స‌ద‌రు వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

Also Read: Ghani Movie Special Song: గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి రచ్చచేసిన తమన్నా!! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News