Nayanatara Remuneration: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. రీసెంట్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన జవాన్ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ ఈ విజయంతో బాలీవుడ్ లో కూడా నయనతార కు మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే గత కొద్ది కాలంగా ఆమె నటించిన సినిమాలు పలు రకాల వివాదాలు చిక్కుకుంటున్నాయి. రీసెంట్ గా నయనతార నటించిన అన్నపూరణి  చిత్రం ఎటువంటి వివాదాలకు  దారి తీసిందో అందరికీ తెలుసు. ఆఖరికి ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్  నుంచి కూడా తొలగించారు. ఆ తర్వాత ఈ మూవీ తరఫున నయనతార క్షమాపణ కూడా చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న 'LIC’ అనే మూవీ లో నటిస్తోంది. ప్రదీప్ రంగనాథన్, కీర్తి శెట్టి,SJ సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో నయనతార ఓ కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ టైటిల్ పై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు లీగల్ గా నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఈ మూవీ కి ఆదిలోనే హంస పాదం అన్నట్టు ఎదురుదెబ్బ తగిలింది.
 
ఈ నేపథ్యంలో నయనతార మూవీ నుంచి తప్పుకోవాలి అని నిర్ణయించుకోవడం తో చిత్ర బృందానికి మరొక పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం ఉన్న సౌత్ హీరోయిన్స్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార ఈ మూవీ నుంచి భారీ మొత్తంలో పారితోషకం ఆశించినట్లు టాక్.ఈ చిత్ర నిర్మాణం లో భర్త విఘ్నేష్ భాగమైనప్పటికీ, నయనతార కు తక్కువ పారితోషకాన్ని సినిమా చేసే ఉద్దేశం లేదు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.అందుకే ఆమె మూవీ నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఈ మూవీ లో కృతి శెట్టి అక్క పాత్ర లో నయనతార కనిపించనుందట. ఇప్పుడు నయనతార మూవీ నుంచి తప్పకుంట్టే..మేకర్స్ ఆ ప్లేస్ లో ఏ యాక్టర్ ను తీసుకుంటారో చూడాలి.


Also Read: Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్‌.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం


Also Read: Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook