SP Balasubrahmanyam's last wish: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరనే దుర్వార్త ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాలు పాడిన ఎన్నో వేల పాటలు మన మధ్యే ఉన్నా.. ఆయన ఇంకా పాడితే వినాలనే కోరిక మాత్రం సంగీత ప్రియులను అందరినీ వేధిస్తోంది. అన్నింటికి మించి బాలు కోరుకున్న చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయారే అనే బాధ మరింత కలచివేస్తోంది. గతంలో ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని మీరు బలంగా కోరుకునే కోరిక ఏంటని అడగ్గా.. ఆయన చెప్పిన మాట ఒక్కటే. ఇప్పటివరకు ఏ ఆరోగ్య సమస్య లేదని.. ఈ లోకం నుంచి వెళ్లిపోయే ముందు కూడా అంతే ఆరోగ్యంగా ( SP Balasubrahmanyam's health) ఉండాలనేదే తన కోరిక అన్నారాయన. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా హాయిగా నిద్రలోనే కన్నుమూయాలనేదే తన చివరి కోరిక అని బాలు చెప్పుకొచ్చారు. Also read : SP Balasubrahmanyam died: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మృతి ( SP Balasubrahmanyam's death news) విషయంలో మాత్రం ఆయన కోరుకున్న విధంగా జరగలేదు. ఎలాంటి నొప్పి లేకుండా, ఆస్పత్రి ముఖం కూడా చూడకుండా హాయిగా నిద్రలోనే కన్నుమూయాలని.. బతికున్నంత కాలం జీవితాన్ని, జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకున్న బాలుకు చనిపోయే ముందు 50 రోజులు ఆస్పత్రిలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. గత కొన్ని రోజులుగా బాలుకు ఎంజీఎం వైద్యులు ఐసీయూలో ఎక్మో, వెంటిలేటర్ సహాయంపైనే చికిత్స అందించారు. Also read : SP Balu's funeral: రేపు గానగంధర్వుడి అంత్యక్రియలు


కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు తేలిన అనంతరం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ( MGM hospital ) చేరిన బాలు అప్పటి నుండి అక్కడే ఉండి చికిత్స పొందుతూ వచ్చారు. ఇటీవలే కరోనా కూడా నయమవడంతో ఇక ఆరోగ్యంగా తిరిగి వస్తారనే అంతా ఆశించారు. కానీ ఇంతలోనే మళ్లీ అనారోగ్యం బారినపడిన బాలు.. ఆస్పత్రి నుండే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. Also read : SP Balu మా ఊరి వ్యక్తి.. టచ్‌లో ఉన్నాను, కానీ: వెంకయ్య నాయుడు భావోద్వేగం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe